ఎన్టీఆర్ బయోపిక్ తరువాత
బాలకృష్ణ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఇలాంటి పరిస్థితులలో భారీ నిర్మాణ సంస్థలు టాప్ దర్శకులు బాలయ్యతో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి కనపరచడం లేదు. ఇలాంటి పరిస్థితులలో బాలయ్యను నమ్ముకుని సినిమాలు తీస్తున్న
నిర్మాత సి.
కళ్యాణ్ కు
బాలకృష్ణ పెడుతున్న టార్చర్ పై ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.
ఈసినిమా మొదలు పెట్టేముందు
బాలకృష్ణ 7 కోట్లు పారితోషికంగా తీసుకుంటానని నిర్మాతకు మాట ఇచ్చి ఇప్పుడు ఈ
మూవీ నిర్మాణం పూర్తి చేసుకుని వచ్చేనెల విడుదలకాబోతున్న సందర్భంలో
బాలయ్య తనకు పారితోషికంగా 14 కోట్లు కావాలని డిమాండ్ చేస్తున్నట్లుగా ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఈ అనుకోని డిమాండ్స్ కు
నిర్మాత కళ్యాణ్ షాక్ లో ఉన్నట్లు ఆ కథనంలో చెప్పబడింది.
బాలయ్య కోరికను మన్నించడానికి
నిర్మాత కళ్యాణ్ ఈ సినిమాకు పనిచేసిన ఇతర టెక్నిషియన్స్ కు అదేవిధంగా ఇతర నటీనటులకు ఇస్తాను అని ఒప్పుకున్నా పారితోషికంలో కోతలు విధిస్తూ
బాలయ్య డిమాండ్ ను మన్నించేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ప్రస్తుతం
బాలకృష్ణ సినిమాలకు పెద్దగా మార్కెట్ లేకపోయినా
బాలకృష్ణ పోలీసు పాత్రలు చేసిన సినిమాలు గతంలో హిట్ అయిన నేపధ్యంలో ఆ సెంటిమెంట్ ను నమ్ముకుని
బాలయ్య ‘రూలర్’ మూవీకి మంచి
బిజినెస్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
దీనితో తన మూవీకి మంచి
బిజినెస్ జరిగింది అని వార్తలు తెలియడంతో
బాలయ్య ఒకేసారి తన పారితోషికాన్ని రెట్టింపు చేసి
కళ్యాణ్ కు షాక్ ఇచ్చాడు అని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా ఇప్పుడు ఆ ప్రముఖ పత్రిక ప్రచురించిన కథనం మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..