ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు దేశాన్ని కుదిపేస్తున్న  కేసు దిశ అత్యాచారం కేసు. పార్లమెంటులో ఇప్పటికే ఈ కేసుపై విపక్ష పార్టీకి చెందిన నాయకులు చర్చ పెట్టాలని పట్టుబట్టి సభలో గందరగోళం సృష్టించడం జరిగింది. ఇదే తరుణంలో సోషల్ మీడియాలో చాలామంది సెలబ్రిటీలు ప్రముఖులు ఇంకా సినిమా హీరోలు ఎవరికి వారు ఈ ఘటనకు పాల్పడిన నిందితులకు కఠినంగా శిక్షలు విధించాలని సమాజంలో మగవాడి ఆలోచనల్లో మార్పు వచ్చే విధంగా కఠిన కారాగార శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో ఉరిశిక్ష పై కఠిన కఠిన కారాగార శిక్ష లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

విషయంలోకి వెళితే సమాజంలో ఎన్ని ఉరిశిక్షను కఠిన శిక్షలు విధించినా ఇలాంటి మృగాళ్లు సమాజంలో కొనసాగుతూనే ఉంటారని ఏవిధమైన పనిష్మెంట్ ఇఛ్చినా ఇలాంటి నేరాలను ఆపలేమని అది మరణశిక్ష అయినా సరే.. దుండగులు తాము ఏదో విధంగా బయటపడతామనే ధీమాతో ఉన్నారని ఆయన అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రావడంతో...కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో కామెంట్లు రేపిస్టులకు చాలా అనుకూలంగా ఉన్నాయని ఇలాంటి నేతలు పదవిలో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి పీకి పారేయండి అంటూ ప్రభుత్వానికి సోషల్ మీడియాలో ఉన్న నెటిజన్లు కామెంట్ల రూపంలో విజ్ఞప్తి చేస్తున్నారు.

 

ఇంత దారుణంగా ఒక స్త్రీ పై అత్యంత అమానుషంగా నలుగురు నిందితులు అత్యాచారానికి పాల్పడితే వారిని అదేవిధంగా అటువంటి ఘటనలను సమర్థించే విధంగా కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో మాట్లాడటం మంచిది కాదని ఆయన చేసిన వ్యాఖ్యలు సవరించుకోవాలి అని నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో వెంటనే కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో నా ఉద్దేశం అది కాదు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇటువంటి క్రూర మృగాలను వెంటనే కాల్చి పారేయాలి అంటూ తన వ్యాఖ్యలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా కుమార్తెలు ఉన్న తల్లిదండ్రులకు జాగ్రత్తలు కూడా సూచించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: