ప్రస్థుతం ఇండస్ట్రీలో 60 సంవత్సరాలు దాటిపోయి కొందరు 60 సంవత్సరాలకు దరిదాపులో ఉన్న నలుగురు సీనియర్ హీరోల రేస్ లో ఒక్క వెంకటేష్ కు తప్ప మరెవ్వరికి 2019 కలిసిరాలేదు. సీనియర్ హీరోలుగా 3 దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీని శాసించిన చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ లలో ఒక్క వెంకీ మామకు తప్ప మరెవ్వరికీ 2019 ఏమాత్రం కలిసిరాలేదు. 

ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఇప్పటికీ కొనసాగుతూ తన మెగా స్టార్ హోదాను కాపాడుకుంటూ కొనసాగుతున్న చిరంజీవి ‘సైరా’ తో ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయాలి అని పడ్డ కష్టానికి పేరు వచ్చింది కాని కలక్షన్స్ పరంగా ఏమాత్రం చిరంజీవి కలలు నెరవేరలేదు. ఇక బాలకృష్ణ పరిస్థితి మరింతఅద్వాహ్నం. ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఎంతో కష్టపడ్డా ఫలితం దక్కలేదు సరికదా విపరీతమైన ఆర్ధిక నష్టాలు వచ్చాయి. 

రీ సెంట్ గా విడుదలైన ‘రూలర్’ మూవీ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో అసలు బాలకృష్ణ సినిమాకు కలక్షన్స్ రావా అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాలకు సమాధానం లేని ప్రశ్నలుగా మారాయి. ఇదే సంవత్సరం షష్టిపూర్తి జరుపుకున్న నాగార్జున తాను ఇప్పటికీ వెండితెర మన్మధుడు ని మాత్రమే అని చెప్పడానికి ‘మన్మధుడు 2’ నటిస్తే ఇలాంటి పాత్రలకు నాగ్ సరిపోడు అంటూ ప్రేక్షకులు తీర్పు ఇచ్చారు.

సీనియర్ హీరోల లిస్టులో చివరిగా మిగిలిన వెంకటేష్ కు మాత్రం ముగిసి పోతున్న 2019 మంచి ఫలితాలను ఇచ్చింది. ఈ సంవత్సరం టాప్ 10 హిట్స్ లో వెంకీ నటించిన ‘ఎఫ్ 2’ అదేవిధంగా లేటెస్ట్ గా విడుదలైన ‘వెంకీ మామ’ సినిమాకు స్థానం దక్కడంతో పాటు ఈ మూవీకి డివైడ్ టాక్ వచ్చినా ఇప్పటికీ ఈ మూవీ కలక్షన్స్ చాలచోట్ల సంతృప్తి కరంగా కొనసాగుతూ ఉండటంతో ‘వెంకీ మామ’ నష్టాలు లేకుండా గట్టేక్కిసినట్లే అని అంటున్నారు. దీనితో తాము సీనియర్ హీరోలము కాము ఎప్పటికీ యంగ్ హీరోలమే అంటూ చిరంజీవి బాలయ్య నాగార్జున వెంకటేష్ లు చెపుతున్న పరిస్థితులలో ఒక్క వెంకటేష్ ను మాత్రమే ప్రేక్షకులు యంగ్ హీరోల స్థాయిలో గుర్తిస్తున్నారా అంటూ కొందరు చేస్తున్న విశ్లేషణలలో ఎంతోకొంత వాస్తవం ఉంది అని అనిపిస్తోంది..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: