టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన నటి సౌందర్య. సావిత్రి తర్వాత మళ్ళి అంతై గొప్ప నటి అంటే సౌందర్య అని ఇండస్ట్రీ మొత్తం ఒప్పుకున్నారు. తెలుగు తమిళం లో స్టార్ హీరోలదరి సరసన నటించి సౌందర్య హఠాత్తుగా మరనించిన విషయం సినీ ఇండస్ట్రీతో పాటు సౌత్ లో ఉన్న ప్రేక్షకులందరిని కలచి వేసింది. అయితే ఆమే మరణం వెనకున్న నిజాన్ని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తాజాగా స్వర్గీయ సౌందర్య గురించి వెల్లడించారు. సౌందర్య చేసిన వంద సినిమాల్లో మాకు ఎనిమిది సినిమాలు మాత్రమే ఆమెతో చేసే అవకాశం దక్కిందని చెప్పారు. సౌందర్యతో మొదట పని చేసినప్పుడు ఎలా ఉందో స్టార్ అయిన తర్వాత కూడా అలాగే ఉంది. పెద్దలు అంటే గౌరవం ఏమాత్రం తగ్గలేదు. హీరోయిన్ గా స్టార్ డం వచ్చి ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా సౌందర్య పెద్దల పట్ల చూపించే గౌరవానికి మేము ముగ్దులం అయ్యేవాళ్లం. ఒకానొక సమయం లో తాను ఒక రచయిత కూతురును అంటూ సౌందర్య చెప్పింది...అని తెలిపారు.

 

పరుచూరి తన తల్లి గారి కోరిక మేరకు ఉస్మానియా యూనివర్శిటీ లో సాహిత్యం లో గౌరవ పట్టా అందుకుంటున్న సమయంలో ఒక విలేకరి ద్వారా సౌందర్య హెలికాప్టర్ ప్రమాదం  తెలిసిందట. చాలా ఆనందకరమైన సమయంలో అలాంటి వార్త వినాల్సి రావడంతో అది నా జీవితంలో గుర్తిండి పోయేలా చేసింది అన్నారు. అసలు సౌందర్య విమానంలో రావాల్సి ఉండగా.. ఆప్తమిత్ర షూటింగ్ ఆలస్యం కావడంతో ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందట. అత్యవసరంగా రావాల్సి పరిస్థి కావడంతో సౌందర్య హెలికాప్టర్ లో బయలుజేరారట. ఒక వేళ ఫలిట్ లోనే సౌందర్య వచ్చి ఉంటే ఈ రోజుకి మన కళ్ళ ముందు ఉండేవారని పరుచూరి అన్నారు. ఒకవేళ సౌందర్య బతికి ఉంటే ఆమె అద్బుతమైన పాత్రలు చేసి ఉండేదంటూ పరుచూరి వెల్లడించారు.

 

ఆ రోజు అంత పెద్ద ఘోరం జరగడానికి షూటింగ్ ఆలస్యం అవడమే. కానీ అప్పట్లో ఈ విషయం బయటకు రానివ్వలేదు. అందుకు కారణం ఇది ముమ్మాటికి దర్శక, నిర్మాతల తప్పే. వాళ్ళు గనక సరిగ్గా ప్లాన్ చేసి ఉంటే ఇలా సౌందర్య చనిపోయో వారు కాదు. కాని హెలికాఫ్టర్ ప్రమాదం అని అసలు నిజాలని కప్పిపెట్టారు. ఇది నూటికి నూరు శాతం దర్శక నిర్మాతలు చేసిన అతి భయంకరమైన తప్పైదే పార్టీ ప్రచారానికి వెళుతూ ప్రమాదానికి గురైందని అసలు నిజాన్ని దాచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: