ఇప్పుడు హీరోగా మారిన సునీల్ ఒకప్పుడు ఎంతగానో నవ్వించే గొప్ప హాస్య నటుడు. సునీల్ ఎన్నో సినిమాలలో నటించి హాస్యాన్ని పండించాడు. తాను సినిమాల్లోకి కష్టపడి వచ్చి ఎంతో మంచి సక్సెస్ని అందుకున్నాడు. ఇలా అప్పటి నుండి కొన్ని వందల సినిమాల్లో సునీల్ నటించాడు.
 
IHG
 
సూనీల్ కి నటన పై ఆసక్తి ఉండడంతో దర్శకుడు రాజా వన్నెం రెడ్డి సునీల్ కి నాటకాలలో నట శిక్షణ ఇచ్చారు. ఇలా మొదట నాటక శిక్షణ తీసుకుని సునీల్ సినిమాల్లో కి ప్రవేశించాడు. స్పెషల్ జ్యూరీ అవార్డు సొంతం చేసుకున్నాడు మర్యాద రామన్న సినిమాతో. అనేక సినిమాలతో తన సత్తాని ప్రూవ్ చేసుకున్నాడు. వివిధ పాత్రలతో సునీల్ ప్రేక్షకులని ఎంతగానో మెప్పించాడు. సునీల్ మంచి హాస్య నటుడిగా పేరు పొందాడు. 
 
 
 
ఢీ, రెడీ, జల్సా, మాస్, బాస్, మన్మధుడు, నువ్వు లేక నేను లేను, ఠాగూర్, మల్లీశ్వరి, కలుసుకోవాలని, విజయం, నేనున్నాను, ఖలేజా, బొమ్మరిల్లు, నువ్వే నువ్వే, ఉల్లాసంగా ఉత్సాహంగా, అతడు, కింగ్, వాసు ఇలా అనేక సినిమాల్లో సునీల్ పాత్ర చెప్పుకోదగినది. అయితే సునీల్ హీరోగా కూడా రాణించినప్పటికీ అంత గొప్ప స్థానాన్ని కైవసం చేసుకోలేకపోయాడు.
 
IHG
 
 
కానీ హాస్య నటుడిగా సునీల్ ఓ మంచి స్థానం సంపాదించి తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాడు. హీరోలకి స్నేహితుడి పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తాడు. అలానే మంచి డైలాగ్స్ తో ఈ హాస్య నటుడు నవ్విస్తూ వినోదాన్ని అందిస్తాడు. ప్రఖ్యాత దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ కి మంచి స్నేహితుడు సునీల్. నటుడిగా, హాస్య నటుడిగా సునీల్ తెలుగు చిత్రాల్లో మంచి స్థానం కైవసం చేసుకున్నాడు. ఇలా తన సినీ కెరీర్ లో అనేక విజయాలని అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: