
కార్తీక దీపం సీరియల్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ప్రేమి విశ్వనాథ్. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ వంటలక్క తాజాగా తనపై వస్తున్న రూమర్లపై సీరియస్ అయ్యింది. కార్తీక దీపం సీరియల్లో ఇకపై తాను నటించబోనంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆ సీరియల్ ఫేమ్ ప్రీతి విశ్వనాథ్ మండిపడింది. తమ గురించి ఫేక్ న్యూస్ ఎందుకు ప్రచారం చేస్తున్నారో తనకు తెలియదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫేస్బుక్లో ఫాలోవర్లతో చిట్ చాట్ చేసింది. ఈ మద్య సెలబ్రెటీలకు గురించి ప్రతి ఒక్క విషయం సోషల్ మీడియాలో రచ్చ అవుతున్న సంగతి తెలిసిందే.
గత కొంత కాలంగా తనపై వస్తున్న ఆరోపణలపై అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తలు ఎవరు యూట్యూబ్‌లో పెట్టారో తెలుసుకుంటామని చెప్పారు. ఆ ఛానెల్‌పై చర్యలు తీసుకునేందుకు సీరియల్ యూనిట్ సిద్ధమైందని పేర్కొన్నారు. కార్తీక దీపం మంచి ఫ్యామిలీ సీరియల్.. ఇలాంటి న్యూస్ ప్రచారం చేస్తే ఏం వస్తుంది? నా ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. ఇలాంటి ప్రచారాలు చేయడం వల్ల వారికి ఏం లాభం చేకూరుతుందో తెలియదు.. చాలా మంది నాకు మెసేజ్ చేసి చెబుతున్నారు. కొందరు ఎందుకిలా అసత్య ప్రచారం చేస్తున్నారో నాకసలు అర్థం కావట్లేదు అని మండిపడింది. తన గురించి ప్రచారం అవుతోన్న న్యూస్ అంతా ఫేక్ అని ఆమె స్పష్టం చేసింది.
తాను ఎక్కడికి వెళ్లడం లేదని, సీరియల్ షూటింగ్లో పాల్గొంటున్నానని చెప్పారు. ప్రస్తుతం ఆమె కేరళలో ఉన్నట్టుగా అభిమానులకు తెలిపింది. అయితే ఇకముందు ఇలాంటి అసత్య ప్రచారం చేసేవారి విషయంలో నేనే కాదు ఎవరైనా సీరియస్ గా వ్యవహరించాలని ఆమె కోారు. సోషల్ మీడియా ఉంది కదా అని తమ ఇష్టానుసారంగా వార్తలు రాయడం.. రూమర్లు సృష్టించడం కొంత మందికి అదే పనిగా మారిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.