టాలీవుడ్ స్టైల్ కా బాప్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే.. మామ్మూలు విషయం కాదు! పవర్ స్టార్ తో సినిమా చేయడానికి పెద్ద పెద్ద స్టార్ దర్శకుల నుంచి, ఈనాటి నవతరం దర్శకులు అందరూ.. ఎంతో ఉత్సాహం చూపిస్తూ వుంటారు. కేవలం అతనితో చేసిన ఒకే ఒక్క సినిమాతో స్టార్ డైరెక్టర్స్ అయిన వారు ఎంతో మంది... ఉదాహరణకు గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్.

 

అందువలననే ఆయనతో సినిమా చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తారు.  వి వి వినాయక్, సంపత్ నంది... ఇలా ఇంకా ఎంతో మంది దర్శకులు సందర్భాన్ని బట్టి.. పవన్ కళ్యణ్ తో సినిమా ఇంటరెస్ట్ గురించి రక రకాల మాధ్యమాలలో చెప్పి వున్నారు. ఇక ఎంతో మంది దర్శకులు అవకాశం వచ్చి కాస్త చేయి జార్చు కొనేవారు లేకపోలేదు.

 

ఇక ఇటీవల సీనియర్ మోస్ట్ డైరెక్టర్ వీరూ.కె  ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మనసులోని భావాలను మీడియా సమక్షంలో పంచుకున్నాడు. వీరూ.కె రక రకాల భాషలలో మొత్తం కలిపి ఇంచు మించుగా 28 సినిమాల వరకూ డైరెక్ట్ చేసారు. ఆయన తెరకు ఎక్కించిన సినిమాల్లో 'ఆరో ప్రాణం' అత్యధిక విజయాన్ని నమోదు చేసుకుందనే విషయం అందరికి విదితమే. ఇక ఆయన మాట్లాడుతూ, 'ఆరోప్రాణం' సినిమా కథను ముందుగా నిర్మాత శ్రీనివాస్ రెడ్డిగారికి అతను చెప్పారట! కొంత కాలం తరువాత శ్రీనివాస్ రెడ్డి గారు ఆ కథను, ఓ డబ్బింగ్ థియేటర్లో కలిసిన పవన్ కళ్యాణ్ గారికి చెప్పారట..

 

కథ విన్న బాబు... 'కథ బాగుంది .. దర్శకుడిని పంపించు .. చేద్దాం' అని శ్రీనివాస్ రెడ్డిగారితో అన్నారట. కానీ దురదృష్టం... శ్రీనివాసరెడ్డి ఆ విషయాన్ని నాకు చాలా ఆలస్యంగా చెప్పాడు. అప్పటికే నేను సదరు మూవీ కథను వేరే వాళ్లతో తీసేసాను. దాంతో ఒక మంచి సినిమాను పవన్ తో చేసే అదృష్టాన్ని పోగొట్టుకున్నాను.. అని వాపోయారు. ఆ రోజున పవన్ ను కలిసుంటే, లైఫ్ ఇంకోలా ఉండేదేమో... ఏం చేస్తాం... ఏదైనా రాసి పెట్టి ఉండాలని అంటారుగదా .. అందుకే నాకు రాసిపెట్టిలేదని అనుకున్నాను... అంటూ బాధపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: