టాలీవుడ్ రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా తీసుకున్నాడు. అంతేకాకుండా విజయ్సినిమా షూటింగ్ లలో ఉండగానే రెండు సినిమాలు తీయడానికి ఓకే చెప్పాడు. ఇందులో krishna INDRAGANTI' target='_blank' title='ఇంద్రగంటి మోహనకృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సినిమా తీసేందుకు ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇంద్రగంటి మోహన్ కృష్ణ మొదటి నుంచి కూడ వైవిధ్య భరితమైన సినిమాలను ముందుకు తీసుకుని వస్తూ ఉంటాడు. ఆ సినిమాలు సక్సెస్ అవ్వడంతో పాటు ప్రశంసలు కూడా అందుకున్నారు. అలాంటి సినిమాలు చేసిన   ఆయనతో కలిసి విజయ్ దేవరకొండ ఒక విభిన్నమైన సినిమాని తీసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

 

ఇకపోతే విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా వీరి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ కూడా ప్రస్తుతం మరింత బలాన్ని ఇస్తుంది. ఇటీవల విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా విజయ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ మోహన్ కృష్ణ ఒక ట్వీట్ చేయడం జరిగింది. దీనికి రిప్లై గా విజయ్ కూడా సంధానం ఇచ్చాడు. ఇంతకీ సంబంధించిన సారాంశం ఏమిటి అన్న విషయానికి వస్తే.. ఈ సంవత్సరం నుంచి ఇంకా మంచి మూవీ ముందుకు తీసుకొని రావాలి అంటూ ట్వీట్ చేసాడు. 

 

దానితో పాటు నువ్వు చేసే అద్భుతాల కోసం నేను ఎదురు చూస్తున్నా అనే అర్థంతో విజయ్ ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేయడం జరిగింది. ఇక మోహన్ కృష్ణ చేసిన ట్వీట్ విజయ్ స్పందిస్తూ... ఆ అద్భుతం మనిద్దరం కలిసి చేద్దాం అంటూ మరలా ట్వీట్ చేయడం జరిగింది. ఇక ఇద్దరి సంభాషణ మేరకు వీరిద్దరి కాంబినేషన్ లో అదిరిపోయే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సినీ అభిమానులు వారి భావన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: