చాలామంది తమ జీవితాలలో నటిస్తూ మాట్లాడుతూ ఉంటారు. అయితే వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏవిషయంలోనూ నటించడు. తాను మనసులో ఏమనుకున్నాడో అదే చెప్పి చాలామందికి షాక్ ఇస్తూ ఉంటాడు. శ్రేయాస్ మీడియా సంస్థ కొత్త కాన్సెప్ట్ తో వర్మ ఆన్ లైన్ థియేటర్ లోకి విడుదలైన 'క్లయిమాక్స్' సినిమాను ప్రమోట్ చేస్తూ ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసాడు.

 

ఇండస్ట్రీలో అందరూ ఒకటి కావడం అనే విషయం బూతు పదం అని చెపుతూ ఇండస్ట్రీలో ఎవరి జీవితాలు వారివే అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు ఇండస్ట్రీలో ఎవరు ఎవర్ని పట్టించుకోరనీ ఏవ్యక్తి అయినా నష్టపోయినప్పుడు మాత్రమే ఆవ్యక్తిని టార్గెట్ చేస్తూ రకరకాల జోక్స్ వేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేస్తూ రాక్షస ఆనందం పొందుతారు అంటూ వర్మ ఇండస్ట్రీ నిజస్వరూపాన్ని బయటపెట్టాడు.


అంతేకాదు ఇప్పటివరకు పరాజయం ఎరుగని రాజమౌళి లేటెస్ట్ గా తీస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ ఒకవేళ ఊహించని విధంగా ఫెయిల్ అయితే ఇండస్ట్రీలో చాలామంది ఆవిషయాన్ని ఒక పండుగ గా చేసుకుంటారు అన్నవిషయం తనకు తెలుసనీ అయితే ఈవాస్తవాన్ని ఎవరు ఓపెన్ గా ఒప్పుకోరు అంటూ కామెంట్ చేసాడు. ఇదేసందర్భంలో సినిమా షూటింగులు తిరిగి ప్రారంభించదానికి ప్రభుత్వం పెడుతున్న నిబంధనలు గురించి కామెంట్స్ చేస్తూ సినిమా షూటింగ్  లొకేషన్ లోకి వచ్చి ప్రభుత్వ వర్గాలు నిఘా పెట్టగలవా అంటూ వర్మ ఎదురు ప్రశ్నలు ఇస్తున్నాడు.


ప్రస్తుతం కరోనా సమస్య వల్ల సినిమా ధియేటర్స్ లో సీట్లు తగ్గించి టిక్కెట్టు రేటు పెంచితే జనం థియేటర్లకు వస్తారని తనకు ఏమాత్రం నమ్మకం లేదనీ అభిప్రాయపడుతున్నాడు. ఇక గాడ్సే జీవితం పై సినిమాతీయడం తన ధ్యేయం అనీ అయినా తన సినిమాలో గాంధీని కించపరచను అన్న క్లారిటీ వర్మ ఇస్తున్నాడు. తాను తీసిన చాల సినిమాలు అన్నీ ఫ్లూక్ హిట్స్ మాత్రమే అనీ ఇండస్ట్రీలోని చాలామంది టాప్ డైరెక్టర్స్ పరిస్థితి కూడ ఇదే అంటూ జోక్ చేసాడు. ఇక త్వరలో తాను ‘నగ్నం’ అనే టైటిల్ తో ఒక షార్ట్ ఫిలిం తీయబోతున్నానని అయితే ఆసినిమాలో ఏముంటుంది అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని వర్మ అంటున్నాడు..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: