ప్రస్తుతం భారతదేశంలో మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి వైరస్కు  ఎలాంటి వ్యాక్సిన్  కూడా లేకపడంతో నివారణ ఒక్కటే మార్గం అయింది. ప్రజలు తమకు తాము ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఈ మహమ్మారి వైరస్ నుంచి తమ ప్రాణాలు కాపాడుకోలేరు . ఈ నేపథ్యంలో ఎంతో మంది సినీ ప్రముఖులు ప్రజలకు అవగాహన కల్పించే విధంగా.. ఎన్నో సూచనలు సలహాలు ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు సరికొత్తగా ప్రయత్నించారు ఇక్కడ కొంతమంది.

 

 మ్యూజిక్ ఆల్బం ద్వారా ప్రజలను చైతన్య పరచాలని నిర్ణయించారు. అయితే ప్రజలను చైతన్య పరిచేందుకు రూపొందించిన కరోనా రక్కసి అనే పాటల ఆల్బమ్ తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివి v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ ఆవిష్కరించారు.  కరోనా  రక్కసి ఆల్బంలోని పాటలను  బాబ్జి రచించగా ఈ పాటలు ప్రజానాట్యమండలి గాయకుడు లక్ష్మణ్ పూడి పాడారు. ఇక ఈ పాటలకు యువ సంగీత దర్శకుడైన ప్రేమ్ స్వరాలను సమకూర్చారు. అయితే తాజాగా ఈ ఆల్బమ్ ను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. 

 

 ఈ సందర్భంగా మాట్లాడిన వివి v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ ... కరోనా వైరస్ ను చూసి మనం ఎలాంటి సందర్భంలోనూ భయపడ కూడదని.. ఈ మహమ్మారి మన దరికి చేరకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా  కష్ట కాలం లో ఆర్థికంగా బలంగా ఉన్న వారు ఆర్థికంగా బలంగా లేని  వారికి సహాయం చేయాలనీ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి సంక్షోభం సమయంలో అందరూ తమ మానవత్వాన్ని చాటి  పేదలకు సహాయాన్ని అందించాలని కోరారు.ఇక కరోనా కష్టకాలంలో ప్రజలను  మరింత చైతన్యపరిచేందుకు ఈ ఆల్బమ్ ను రూపొందించిన బాబ్జి,  లక్ష్మణ్ పూడి గారికి అభినందనలు తెలిపారు వివి వినాయక్.

మరింత సమాచారం తెలుసుకోండి: