భాగ్యనగరంలో కరోనా తార స్థాయిలో ఉన్నసమయంలో సెలెబ్రెటీలు అంతా బయటకురావడానికి హడలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో జూనియర్ ఎన్టీఆర్ ఈకరోనా వైరస్ భయాలను లెక్కచేయకుండా ఒక యాడ్ షూటింగ్ లో గతవారం పాల్గొన్నాడు అంటూ వచ్చిన వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.


తెలుస్తున్న సమాచారంమేరకు జూనియర్ గతకొన్ని సంవత్సరాలుగా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఒక శీతలపానీయా కంపెనీ కోసం ఒక యాడ్ లో ఈకరోనా పరిస్థితుల మధ్య నటించాడు అని తెలుస్తోంది. వాస్తవానికి ఈప్రముఖ శీతలపానీయా కంపెనీ యాడ్ లో నటిస్తానని జూనియర్ గడిచిన ఫిబ్రవరిలోనే ఎగ్రిమెంట్ చేసుకుని దానికి సంబంధించిన పారితోషికం కూడ ముందుగానే తీసుకున్నట్లు టాక్.


ఆతరువాత లాక్ డౌన్ పరిస్థితులు ఏర్పడటంతో ఈయాడ్ షూటింగ్ ఆగిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు మళ్ళీ షూటింగ్ లకు అనుమతులు లభించడంతో ఆ శీతలపానీయ కంపెనీ జూనియర్ పై ఒత్తిడి చేసి తమ ప్రోడక్ట్ యాడ్ షూటింగ్ ను గతవారం ఒకప్రముఖ స్టూడియోలో షూట్ చేసినట్లు టాక్. ఈ యాడ్ లో జూనియర్ ఒక ఎనర్జీ డ్రింక్ త్రాగుతూ ఈకరోనా పరిస్థితులలో మీరు మీకుటుంబంతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ తన సహజసిద్ధమైన బాడీ లాంగ్వేజ్ తో ఈ యాడ్ లో నటించినట్లు తెలుస్తోంది.


వాస్తవానికి ఈమధ్య జూనియర్ ఈ లాక్ డౌన్ సమయంలో తాను ‘ఆర్ ఆర్ ఆర్’ లో నటిస్తున్న కొమరం భీమ్ పాత్ర కోసం రాజమౌళి సలహామేరకు బాగా లావు అయ్యాడుఅన్న లీకులు వస్తున్నాయి. అయితే జక్కన్న సూచనలతో తన గెటప్ ఎక్కడా బయటపడకుండా చాలజాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఈకూల్ డ్రింక్ యాడ్ కోసం తారక్ నటించవలసిన పరిస్థితులు ఏర్పడటంతో తన గెటప్ ఎక్కడా బయటపడకుండా తల పై క్యాప్ పెట్టుకుని తన పెరిగిన జుట్టును కవర్ చేసుకుంటూ కేవలం తన గుబురు మీసాలు మాత్రమే కనిపించే విధంగా ఈయాడ్ లో కవర్ చేసాడు అనితెలుస్తోంది. త్వరలో అన్ని ప్రముఖ ఛానల్స్ లో ఈయాడ్ ప్రసారం కాబోతున్న పరిస్థితులలో జూనియర్ లుక్ ను దాచడానికి రాజమౌళి చేసిన ప్రయత్నాలు అన్నీ వృథా అయినట్లే అనుకోవాలి. ఈ యాడ్ లో నటించే విషయంలో రాజమౌళి అంగీకారం తీసుకుని నటించాడా లేదంటే తన ఎగ్రిమెంట్ బ్రేక్ చేయడం ఇష్టంలేక జూనియర్ ఈ యాడ్ లో నటించాడా అన్న విషయమై క్లారిటీ లేకపోవడంతో రాజమౌళి బందిఖానా నుండి నెమ్మదినెమ్మదిగా జూనియర్ చరణ్ లు అన్ లాక్ అవుతున్నారా అంటూ కొందరు ఈ న్యూస్ పై కామెంట్స్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: