ప్రముఖ బాలీవుడ్ నటుడు నిర్మాత దర్శకుడు శేఖర్ కపూర్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలలో విపరీతంగా గుబులు పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న ఈకరోనా పరిస్థితుల మధ్య మరొక సంవత్సరం వరకు భారతదేశంలో సినిమా ధియేటర్లు మళ్ళీ ఓపెన్ అయ్యే పరిస్థితులు లేవనీ శేఖర్ కపూర్ తన అభిప్రాయాన్ని చాలస్పష్టంగా తెలియచేసాడు.


అంతేకాదు బాలీవుడ్ తో పాటు వివిధ భాషలకు చెందిన ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలను ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ద్వారా విడుదలచేయడం తప్ప మరొక మార్గం లేదు అంటూ శేఖర్ కపూర్ అభిప్రాయపడుతున్నాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ వెనుక ఉన్న ఆంతర్యం గురించి ఇప్పుడు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అనేక చర్చలు జరుగుతున్నాయి.


శేఖర్ కపూర్ అంచనాల ప్రకారం మరొక ఏడాది వరకు ధియేటర్లు ఓపెన్ కాకపోతే కేవలం ఒక్క టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకే వేల కోట్లల్లో నష్టాలు వస్తాయని ఆ నష్టాల నుండి తేరుకోవడం ఇండస్ట్రీకి శక్తికి మించిన పని అంటూ అభిప్రాయపడుతున్నారు. కేవలం విడుదలకు రెడీ అయిన సినిమాలు కాకుండా నిర్మాణం చివరిలో అదేవిధంగా మధ్యలో ఆగిపోయిన సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 50 సినిమాల వరకు ఉన్నట్లు ఒక అంచనా వస్తోంది.


ఈ సినిమాల షూటింగ్ లు అన్నీ ఒక సంవత్సరం ఆగిపోతే ఇండస్ట్రీ కోలుకోలేని విధంగా దెబ్బ తింటుందని దీనితో కరోనా పరిస్థితులతో పోరాటం చేస్తూ సినిమాలు తీయడానికి ప్రోత్సహించే హీరోలు ఎవరు అన్న కోణంలో ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. మరికొందరైతే అక్టోబర్ నుండి దేశవ్యాప్తంగా ధియేటర్లు తెరుచుకుని తీరుతాయని దానికి అనుగుణంగా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ వర్గాలను చైతన్య పరిచి ముందుకు నడిపించే రియల్ హీరో ఒకరు కావాలి అంటూ అభిప్రాయపడుతున్నారు. అయితే టాప్ హీరోలు అంతా కరోనాకు భయపడి తమ ఫామ్ హౌస్ లలో దాక్కుంటున్న పరిస్థితులలో ఇప్పుడు చైతన్య పరచగలిగిన ఆ హీరో ఎవరు అన్న విషయం తెలియాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: