‘ఆచార్య’ సినిమాకోసం పెంచుకున్న మీసాన్ని ఒకేసారి చిరంజీవి తీసివేయడం ఇప్పడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సత్యదేవ్ హీరోగా నటించిన ‘బ్లఫ్ మాస్టర్’ సినిమా చూసి ఆచిత్ర దర్శకుడు గోపీ గణేష్ ను ఇంటికి పిలిపించుకుని అభినందించిన సందర్భంలో బయటపడ్డ చిరంజీవి లుక్ చూసి చాలమంది ఆశ్చర్య పోతున్నారు. దీనితో ‘ఆచార్య’ షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేకపోవడంతో చిరంజీవి ఇలా మారిపోయాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలాఉండగా ‘ఆచార్య’ సినిమాకు ఇద్దరు డైరెక్టర్లు ఇద్దరు హీరోలు ముగ్గురు నిర్మాతలు 3 నలుగురు హీరోయిన్స్ ఉన్నారా అంటూ కొందరు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటి సందేహాలు రావడం వెనుక ఒక ఆసక్తిగల కారణం ఉంది.
వాస్తవానికి ఈసినిమాకు డైరెక్టర్ కొరటాల శివ అయినప్పటికీ ఈమూవీలో కీలకంగా ఉండే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ చిత్రీకరణలో చిరంజీవి సలహా మేరకు వినాయక్ కొరటాల కు కొన్నిసలహాలు ఇస్తున్నట్లు టాక్. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ తీయడంలో వినాయక్ కు మంచి సమర్థత ఉంది అని చిరంజీవి భావిస్తున్న పరిస్థితులలో కొరటాలకు సలహాలు ఇమ్మని చిరంజీవి వినాయక్ ను కోరినట్లు టాక్.
అదేవిధంగా ఈమూవీకి హీరో చిరంజీవి అయినప్పటికీ మరోకీలక పాత్రలో చరణ్ నటిస్తున్న నేపధ్యంలో ఈమూవీ ఇద్దరు హీరోల సినిమాగా మారబోతోంది. హీరోయిన్స్ విషయానికి వస్తే ఈసినిమాకు కాజల్ మెయిన్ హీరోయిన్ అయినప్పటికీ ఈమూవీలో కీలకపాత్రను పోషిస్తున్న రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వాని నటిస్తోంది. ఇదిచాలదు అన్నట్లుగా ఈమూవీ స్పెషల్ సాంగ్ లో రెజీనా కనిపిస్తే మరోకీలక పాత్రలో తమన్నా కూడ నటిస్తోంది అన్నప్రచారం జరుగుతోంది.
ఇప్పుడు ఈసినిమాను మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ తో కలిసి రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తూ ఉంటే ఈసినిమాకు అల్లు అరవింద్ ఫైన్సాన్ చేస్తున్నాడు అన్నగాసిప్పులు కూడ వస్తున్నాయి. దీనితో ‘ఆచార్య’ సినిమాకు ఎందరు హీరోలు మరెందరు హీరోయిన్స్ అసలు ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అంటూ ఈ మూవీ పై వస్తున్న వార్తలు విని ఆశ్చర్య పోతున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి