రోజు రోజుకీ కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంత కూ పెరిగి పోతున్న విషయం తెలిసిందే. కేవలం ఒక రాష్ట్రం లో మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా  వైరస్ కేసు లు రికార్డు స్థాయిలో పెరిగి పోతున్నాయి. అయితే ఇక్కడ మంచి విషయం ఏమిటి అంటే.. కరోనా కేసుల సంఖ్య రికార్డు స్థాయి లో పెరుగుతున్నప్పటికీ... కరోనా  నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అదే రేంజ్ లో  వుండడం ప్రస్తుతం అందరి లో కాస్త ధైర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం దాదాపుగా అన్ని వయస్సుల వారు కరోనా  వైరస్ బారినపడి చికిత్స తీసుకొని కోలుకుంటున్న విషయం తెలిసిందే.



 అటు మరణాల సంఖ్య కూడా చాలా తక్కువ గానే ఉంది. అయితే కరోనా  వైరస్ బారి నుంచి కోలుకున్నప్పటికీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాల కే ముప్పు అని సూచిస్తున్నారు వైద్యులు. కరోనా  నుంచి కోలుకున్న తర్వాత మరింత  జాగ్రత్తగా ఉండాలని..  కరోనా  నుంచి కోలుకున్న తర్వాత రోజులే  ఎంతో ముఖ్యమైనవి అంటూ చెబుతున్నారు. తగిన జాగ్రత్తలు పాటించడంతో పాటు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలని లేకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది అంటూ హెచ్చరిస్తున్నారు.




 కరోనా  నుంచి కోలుకున్న తరువాత నిర్లక్ష్యంగా ఉంటే గుండె మెదడు కిడ్నీ సమస్యలు తలెత్తే ముప్పు ఉంటుందని... అంతే కాకుండా మరోసారి కరోనా  వైరస్ బారిన పడే అవకాశం కూడా ఉంటుంది అందరూ వైద్య నిపుణు లు చెప్తున్నారు. కరోనా  రాకముందు ఎంత అప్రమత్తంగా  ఉన్నారో  కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా అంతకు మించిన అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గుండె, కిడ్నీ,  మధుమేహం,  కాలేయం ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్ళు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: