విమర్శల వర్మ.... ప్రస్తుతం సంచలనమైన
కంగనా కాంట్రవర్సి పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు...
కంగనా వర్సెస్
శివసేన ల ఘట్టం ఎంత వైరల్ గా మారిందో తెలిసిన విషయమే. వీరి మధ్య మాటల యుద్ధం ఎంతటి బీభత్సానికి దారి తీసిందో తెలిసిందే. ముంబైలో ఉన్న
కంగనా కార్యాలయాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేయడంతో
శివసేన అధినేతలపై విరుచుకుపడ్డారు.
కంగనా తాను ముంబైలో అడుగు పెడుతున్నానని ఎవరు ఏం చేస్తారో చూస్తాను అంటూ ఛాలెంజ్ చేసి ముంబైలో ల్యాండ్ అయింది. ప్రస్తుతం ఇంటిని కార్యాలయాన్ని కూల్చివేసిన బీఎంసీ ను వ్యతిరేకిస్తూ న్యాయ పోరాటానికి నడుంబిగించారు కంగన.
ఇక ఈ విషయాలు తెలుసుకున్న
ఆర్జీవీ తన స్టైల్ లో సెటైర్లు వేసారు. ఇండియాకు దాపరించిన కరోనాకు.. శివసేనకు పట్టుకున్న కంగనాకు వ్యాక్సిన్ లేదంటూ పంచ్ విసిరాడు. అంతేకాదు పార్టీలన్నిటినీ ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్జీవీ.
కంగనా మహారాష్ట్ర సీఎం అవుతుందని.. అర్నబ్ పీఎం అవుతాడని..
కాంగ్రెస్ ఇటలీకి పారిపోతుందని సెటైర్ వేశారు. అదే తరహాలో
శివసేన మాయమైపోతుందని కూడా చెప్పాడు. ఇలా వరుసగా సోషల్ మీడియాలో సందేశాలు
ఆర్జీవీ ఎవరికి మద్దతు పలుకుతున్నాడో ఎవరిని నిందిస్తున్నాడో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నారు నెటిజన్లు. గతంలో రిపబ్లిక్
టీవీ యాంకర్..
అర్నాబ్ గోస్వామి పై ఓ చిత్రం తీస్తానని ప్రకటించిన ఆర్జీవి....
మీడియా ప్రాస్టిట్యూట్ టైటిల్ని రిజిస్టర్ చేయించినట్లు తెలిపారు.
ఇక....బంధుప్రీతి వల్ల ప్రయోజనం ఉండదని నెపోటిజం స్టార్ లపై పదునైన బాణాలు వదిలాడు. సుశాంత్ కేసులో
బాలీవుడ్ ని దోషిని చేసినా ఎవరు... స్పందించకపోవడం పై పంచ్ లు విసిరాడు. చివరిగా...
శివసేన ఇలా తయారైతే పెద్దాయన ఆత్మ కలత చెందుతుందని....
మహారాష్ట్ర ప్రభుత్వం ఇలా అయిపోయిందేమిటి? అని కూడా వ్యాఖ్యలు చేశాడు....ఇలా ఎవరిని వదలకుండా ఒక రౌండ్ క్లాసు తీసుకున్నాడు విమర్శల గురువు ఆర్జీవి.