గత ఏడాది సంక్రాంతి సమయంలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కి రిలీజ్ అయిన ఎన్టీఆర్ కథయకుడు, అలానే ఆ తరువాత రిలీజ్ అయిన మహానాయకుడు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ, వాటితో ఘోరంగా పరాజయాలు అందుకున్నారు. ఇక వాటి అనంతరం గత ఏడాది డిసెంబర్ లో ప్రముఖ దర్శకుడు కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రూలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య, ఆ సినిమా తో కూడా మరొక ఫ్లాప్ ని చవి చూసారు. ఇక ప్రస్తుతం తన కెరీర్ లో సింహా, లెజెండ్ వంటి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ముచ్చటగా మూడవ సినిమా చేస్తున్నారు బాలయ్య.  

ఇక ఇటీవల బాలయ్య జన్మదినం సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు ప్రేక్షకాభిమానుల నుండి మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై వారిలో భారీ స్థాయిలో అంచనాలు పెంచింది. రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో జరుగనుంది. ఇక ఈ సినిమా అనంతరం తనకు కెరీర్ లో పలు సక్సెస్ఫుల్ సినిమాలు అందించిన బి. గోపాల్ దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేయనున్నట్లు ఇటీవల కొద్దిరోజులుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో బాలయ్య ఒక సినిమా చేయనున్నట్లు చెప్తున్నారు.  

ఇటీవల ఒకానొక సందర్భంలో బాలయ్యను కలిసిన త్రివిక్రమ్, ఆయనకు అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగె ఒక పవర్ఫుల్ స్టోరీ లైన్ ని వినిపించారని, అది ఎంతో నచ్చిన బాలయ్య, దాని పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయండి, వీలైనంత త్వరగా సెట్స్ మీదకు తీసుకు వెళదాం అని మాట ఇచ్చారట. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాని అతి త్వరలో ఎన్టీఆర్ తో తీయనున్న సినిమా అనంతరం త్రివిక్రమ్ తెరకెక్కించనున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదుగాని, ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మాత్రం తొలిసారిగా బాలయ్య, త్రివిక్రమ్ ల కాంబోలో ఒక అద్భుతమైన సినిమా చూడవచ్చన్నమాట .....!!

మరింత సమాచారం తెలుసుకోండి: