సినిమా నటీనటులంతా కరోనా భయంతో ఇళ్లకే పరిమితమైన వేళ.. ధైర్యం చేసి షూటింగ్ లకు హాజరైన తొలి టాలీవుడ్ హీరో నాగార్జున. బిగ్ బాస్ యాడ్ షూటింగ్ కోసం నాగార్జున తొలిసారి మేకప్ వేసుకున్నారు. ఆ తర్వాత ఆయన బిగ్ బాస్ రియాల్టీ షో షూటింగ్ లో కూడా పాల్గొన్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. వైల్డ్ డాగ్ సినిమా మరో ఎత్తు. వైల్డ్ డాగ్ కోసం నాగార్జున చాలా కష్టపడ్డారు. మొదట హైదరాబాద్ లో షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత మనాలి వెళ్లారు. హిమాలయాల్లో అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేశారు. 60ఏళ్ల వయసులో అక్కడ యువ నటీనటులతో కలసి నాగార్జున బాగా ఎంజాయ్ చేశారట. వారితో పోటీపడి మరీ రిస్కీ షాట్స్ చేశారట. నాగార్జున ఉత్సాహం చూసి యువ నటీనటులు ఆశ్చర్యపోయారట. ఈ విషయాలన్నీ చిత్ర యూనిట్ వెల్లడించింది.

నాగార్జున, దియామీర్జా జంటగా అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డిసినిమా నిర్మిస్తున్నారు. సయామీ ఖేర్‌ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. కొన్ని యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు చెబుతున్నాడు డైరెక్టర్ అహిషోర్ సాల్మన్. ఈ సినిమాలో నాగార్జున ఏసీపీ విజయ్‌ వర్మ అనే ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా కనిపించబోతున్నారు. ఇప్పుడీ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ  పూర్తయిపోయింది.

కొద్ది రోజులుగా మనాలిలోని హిమాలయాల్లో నాగార్జునకి సంబంధించి కీలక ఎపిసోడ్లు చిత్రీకరించారు. నాగార్జున ఎపిసోడ్ పూర్తి కాగానే ఆయన అక్కడినుంచి బయలుదేరారు. నాగార్జున పాత్ర పూర్తయినా.. వైల్డ్ డాగ్ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉందని చెబుతోంది చిత్ర యూనిట్. నాగ్ లేకుండా మరికొన్ని కీలక సన్నివేశాలని అక్కడ చిత్రీకరిస్తున్నారు.

ఇక హైదరాబాద్ లో కూడా మరికొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. వారం రోజుల తర్వాత మొదలయ్యే ఈ షూటింగ్ లో నాగార్జున కాస్త ఆలస్యంగా పాల్గొంటారని తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ ని తేల్చేసి, ఆ తర్వాత నాగార్జున మరో కొత్త సినిమాని మొదలు పెడతారని తెలుస్తోంది. తన సినిమాలు తాను చేస్తున్నా కూడా.. కొడుకుల కెరీర్ గురించి కూడా నాగ్ సీరియస్ గా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా అఖిల్ సినిమా విజయంపై నాగార్జున ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: