టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి నుండి ఏదైనా సినిమా వస్తుంది అంటే చాలు దాని పై ప్రేక్షకులు, అలానే అభిమానుల్లో తారా స్థాయిలో అంచనాలు ఉంటాయి అని చెప్పక తప్పదు. ఆ విధంగా తన ప్రతి ఒక్క సినిమా తో కూడా సక్సెస్ అందుకుని ప్రేక్షకాభిమానుల్లో గొప్ప క్రేజ్ దక్కించుకున్నారు రాజమౌళి. మొదటగా ఎన్టీఆర్ హీరో గా తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా మెగా ఫోన్ పట్టిన రాజమౌళి, తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత మరొక సారి ఎన్టీఆర్ తోనే ఆయన తీసిన సింహాద్రి సినిమా మరింత పెద్ద సక్సెస్ అందుకుని దర్శకుడు రాజమౌళి కి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.

ఇక అక్కడి నుండి వరుసగా ఛాన్స్ లతో కొనసాగిన రాజమౌళి, వాటి ద్వారా మరిన్ని సక్సెస్ లు అందుకుని ముందుకు దూసుకెళ్లారు. ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు సినిమాలు ఎంత గొప్ప విజయాలను అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకదానిని మించేలా మరొకటి అత్యధిక స్థాయిలో కలెక్షన్లు అందుకని తెలుగు సినిమా రేంజ్ ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాయి. ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా ఆర్ ఆర్ ఆర్. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి తరువాత రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే దీని దీని అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు తో రాజమౌళిసినిమా చేయనున్న విషయం తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కె.ఎల్ నారాయణ నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించి కొద్ది రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో పలు కథనాలు ప్రచారం అవుతున్నాయి.

వాటిని బట్టి ఈ సినిమా ని జేమ్స్ బాండ్ తరహా జానర్ లో రాజమౌళి తెరకెక్కించనున్నాడని అలానే అత్యద్భుత రీతిలో కొనసాగే విధంగా ఇప్పటికే ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్సినిమా కథని సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాకి దాదాపు రూ. 700 కోట్ల రూపాయలకు పైచిలుకు  ఖర్చు అవుతుందని అన్ని విధాలుగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా భారీ కమర్షియల్ విలువలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజమౌళి దీన్ని తెరకెక్కించనున్నాడని అంటున్నారు. ఒకరకంగా ఇది ఇప్పటివరకు అటు రాజమౌళితో పాటు ఇటు మహేష్ బాబు కెరీర్లో కూడా అతి పెద్ద భారీ బడ్జెట్ సినిమా అనే చెప్పాలి. ఇంత పెద్ద ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా రేపు రిలీజ్ తర్వాత ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో ఏ రేంజ్ లో లాభాలు తెచ్చిపెడుతుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: