ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో కొనసాగుతున్న క్రేజీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ఇటీవల 14 వ వారం లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. నిన్నటితో సక్సెస్ఫుల్ గా నాలుగు రోజులు పూర్తిచేసుకున్న ఈ షోలో మరొక మూడు రోజుల అనంతరం ప్రస్తుతం ఎలిమినేషన్ జోన్లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్ అయిన మోనాల్, హారిక, సోహైల్, అభిజీత్, అరియనా లలో ఎవరో ఒకరు ఇంటి బాట పట్టక తప్పదు. మరోవైపు అఖిల్ ఇటీవల రేస్ టు ఫినాలే మెడల్ గెలుచుకుని డైరెక్ట్ గా ఫైనల్ కి నామినేట్ అయిన విషయం తెలిసిందే.

ఇక హౌస్ లో ఎవరికి వారు కంటెస్టెంట్స్ ఎంతో ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్ తో తమదైన శైలిలో ముందుకు దూసుకెళ్తుండగా బిగ్ బాస్ కూడా హౌస్ మేట్స్ కి పలు విధాలైన ఆసక్తికరమైన టాస్క్ లను ఇస్తున్నారు అనే చెప్పాలి. ఇక రోజు రోజుకి ఈ షోకి టిఆర్పి రేటింగ్స్ అలానే ప్రేక్షకుల ఆదరణ మరింత పెరుగుతూ ఉండటంతో ఫినాలే సమయానికి దీని రేటింగ్స్ తారాస్థాయికి చేరే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ తాజా సీజన్ కి కింగ్ అక్కినేని నాగార్జున పోస్ట్ గా వ్యవహరిస్తూ తనదైన పోస్టింగ్ టాలెంట్ తో షోని ముందుకు నడిపిస్తున్నారు అనే చెప్పాలి. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే ఈ తాజా సీజన్లో అందరికంటే ఒక ఒకింత ముందు స్థానంలో కొనసాగుతూ భారీస్థాయిలో ఓట్లు దక్కించుకుంటున్న వ్యక్తి అభిజిత్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన అభిజిత్ ఆ తర్వాత పెళ్లి గోల అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి పేరు దక్కించుకున్నాడు. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ లో అతను వ్యవహరిస్తున్న తీరు ఆడుతున్న మైండ్ గేమ్ విధానం మెజారిటీ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకోవడంతో అతనికి భారీ స్థాయిలో ఓట్లు వస్తున్నట్లు తెలుస్తోంది.  

మరోవైపు అతడికి ప్రతి వారం కూడా దాదాపుగా 50 శాతం వరకు ఓటింగ్ దక్కుతుందని, అలానే మిగిలిన 50 శాతం హౌస్ లోని మిగతా కంటెస్టెంట్స్ అందరూ పంచుకుంటున్నారని పలు అనధికారిక సోషల్ మీడియా ఓటింగ్ పోల్స్ యొక్క సమాచారం. అయితే అతడి తర్వాత అఖిల్ అలానే సోహెల్ అరియనా కూడా మంచి ఓటింగ్ దక్కించుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే ఓటింగ్ విషయంలో అభిజిత్ ఈ విధంగా దూసుకెళ్లడంతో అతడు రాబోయే రెండు వారాల్లో కూడా ఇలాగే కొనసాగితే ఎట్టిపరిస్థితుల్లో విజేతగా నిలిచే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి అభిజిత్ రాబోయే రోజుల్లో కూడా ఈ విధంగానే దూకుడుగా ముందుకు సాగుతాడా, బిగ్ బాస్ 4 ఫైనల్ విన్నర్ గా నిలుస్తాడా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: