
ఇప్పటికే ఈ మూడు సినిమాలకు సంబంధించి పూర్తి గా తన కాల్షీట్స్ ని ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధం చేశారట ప్రభాస్. అందుతున్న సమాచారాన్ని బట్టి నేడు సలార్ షూటింగ్ ప్రారంభం కానుండగా, మరికొద్దిరోజుల్లో నాగ అశ్విన్ మూవీ షూటింగ్ కూడా షురూ కానుంది. మరోవైపు ఆదిపురుష్ కి సంబంధించి కూడా కొంత వర్క్ జరుగుతోంది. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే, ప్రభాస్ తో నాగ అశ్విన్ తీయనున్న భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాకి సంగీత దర్శకుడు గా యువ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ ని అలానే ఫోటోగ్రాఫర్ గా యూరోపియన్ ఫిలిం మేకర్ కమ్ ఫోటోగ్రాఫర్ అయిన డానీ శాంచెజ్ లోపెజ్ ని ఎంపిక చేసింది మూవీ యూనిట్.
ఈ సందర్భంగా వారిద్దరి పేర్లను తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అధికారికంగా అనౌన్స్ చేసింది మూవీ యూనిట్. ఇక తనకు వచ్చిన ఈ భారీ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకుని మంచి అవుట్ ఫుట్ ఇస్తానని మిక్కీ అన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా దీపికా పడుకొనే నటిస్తుండగా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.....!!