మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ప్రస్తుతం తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఆచార్య. దేవాలయాల భూములు, కుంభకోణాల నేపథ్యంలో దర్శకుడు శివ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటిస్తున్నారు ఆయన తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.

కాగా ఇందులో ఆయన సిద్ద అనే ముఖ్య పాత్ర చేస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ ఛాయాగ్రాహకుడు తిరు ఫోటోగ్రఫి అందిస్తుండగా సోనూ సూద్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లూమ్ మోషన్ పోస్టర్ ఇటీవల మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయి సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. మంచి మెసేజ్ తో పాటు ఆడియన్స్ ని ఆకట్టుకునే పలు కమర్షియల్ హంగులు కలగలిపి దర్శకుడు కొరటాల శివసినిమా ని ఎంతో గొప్పగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మెగా ఫ్యాన్స్ కి ఆ ట్రీట్ ని కొద్దిసేపటి క్రితం అందించింది యూనిట్. యూట్యూబ్ లో కొన్ని క్షణాల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ప్రస్తుతం భారీ వ్యూస్, లైక్స్ తో దుమ్మురేపుతోంది. మెగాస్టార్ లుక్స్, వండర్ఫుల్ విజువల్స్, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, భారీ యాక్షన్ సన్నివేశాలు, రామ్ చరణ్ వాయిస్ ఓవర్, మెగాస్టార్ డైలాగ్స్, వెరసి ఈ టీజర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చిపెడుతోంది. ఇక ఈ టీజర్ రిలీజ్ తరువాత ఆచార్య పై అందరిలోనూ విపరీతంగా అంచనాలు పెరిగాయి అనే చెప్పాలి. ఆ విధంగా మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ అనే విధంగా కేవలం టీజర్ తోనే ప్రేక్షకులు అందరి దృష్టిని తనవైపునకు త్రిప్పుకున్నారు మెగాస్టార్....!!

మరింత సమాచారం తెలుసుకోండి: