
ఇక దీక్షకి మోడలింగ్ లో ప్రవేశం లేకపోయినా కూడా మిస్ ఇండియా కాంటెస్ట్ లో టాప్ టెన్ ఫైనలిస్ట్స్ లో ఒకరిగా నిలిచారు. అంతే కాకుండా మిస్ ఫ్రెష్ ఫేస్ టైటిల్ గెలుచుకున్నారు. హైదరాబాద్ లో ఒక మోడలింగ్ అసైన్మెంట్ కోసం వచ్చినప్పుడు వేదం సినిమా కాస్టింగ్ డైరెక్టర్ దీక్షాసేథ్ ని చూశారు. దాదాపు 70 మందిని రిజెక్ట్ చేసిన తర్వాత దీక్షాసేథ్ ఆ రోల్ కి సెలక్ట్ అయ్యారు. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి జోడిగా నటించారు దీక్షా సేథ్.

ఆ తర్వాత తెలుగులో మిరపకాయ్, వాంటెడ్, నిప్పు, రెబెల్, ఊకొడతారా ఉలిక్కి పడతారా సినిమాల్లో నటించారు. తమిళ్ లో విక్రమ్ తో రాజా పట్టై, శింబు తో వెట్టై మన్నన్ సినిమాల్లో నటించారు. కానీ వెట్టై మన్నన్ సినిమా విడుదల అవ్వలేదు. 2014లో కపూర్ కుటుంబం వారసుడు అర్మాన్ జైన్ హీరోగా నటించిన లేకర్ హమ్ దివానా దిల్ సినిమాతో హిందీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు దీక్షా సేథ్. ఆ తర్వాత హిందీలో హౌస్ ఆఫ్ డెడ్ సినిమాలో నటించారు. తర్వాత కన్నడలో జగ్గు దాదా సినిమాలో నటించారు. 2016 లో సాత్ కదమ్ అనే హిందీ సినిమాలో చివరిగా నటించారు దీక్షా సేథ్. దీక్షా సేథ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ప్రస్తుతం దీక్ష సేథ్ ఇలా ఉన్నారు.