ఎట్టి పరిస్థితులలోను ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని అక్టోబర్ 13న విడుదల చేయాలి అన్న టార్గెట్ తో రాజమౌళి ఎంత పరుగులు తీస్తున్నప్పటికీ ఈమూవీకి సంబంధించిన పెండింగ్ షూటింగ్ ఇంకా 50 రోజులు మిగిలి ఉన్నట్లు టాక్. దీనితరువాత ఈమూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు గ్రాఫిక్ పనులు ఇంకా చాల ఉండటంతో ఇన్ని పనులు అనుకున్న టార్గెట్ డేట్ కు ఎలా పూర్తి చేయాలి అన్న టెన్షన్ లో రాజమౌళి ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.


ఈ పరిస్థితులు ఇలా ఉండగా మార్చి ప్రారంభం నుండి పెరిగిన ఎండలను లెక్కచేయకుండా ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ను పరుగులు తీయిస్తున్నప్పటికీ ఈ వాతావరణ మార్పులు కారణంగా ‘ఆర్ ఆర్ ఆర్’ యూనిట్ సభ్యులు త్వరగా అలిసిపోతున్న పరిస్థితులలో మరింత పెరిగిపోయే ఎండల వేడి మధ్య ఇంకా పెండింగ్ ఉన్న 50 రోజుల షూట్ ను ఏ విధంగా పూర్తి చేయాలో అర్థం అవ్వక రాజమౌళి చాల అసహనంగా ఉన్నట్లు గాసిప్పులు గుప్పు మంటున్నాయి.


ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతున్నప్పటికీ ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ అలియా భట్ ల మధ్య చిత్రీకరించ వలసిన ఒక పాటకు సంబంధించి నిర్మించిన ఒక సెట్ కు సంబంధించిన వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. 1920 కాలాన్ని ప్రతిబింబించే విధంగా డిజైన్ చేయబడ్డ ఈ భారీ సెట్ ను ‘బాహుబలి’ ఫేమ్ సబు సెరిల్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.


ఈ పాటను చూసే ప్రేక్షకులు 1920 నాటి కాలంలో ఉన్నామా అని అనిపించే విధంగా ఒక అద్భుతమైన డిజైన్ లో ఈ సెట్ ను డిజైన్ చేసారని తెలుస్తోంది. వచ్చే వారం నుండి షూట్ మొదలుపెట్టబోతున్న ఈ భారీ సెట్ లో చరణ్ అలియా భట్ లపై ఒక డ్రీమ్ సాంగ్ ను తీయబోతున్నారు. సుమారు 100 మంది జూనియర్ డాన్సర్ల మధ్య చరణ్ అలియా భట్ లతో చిత్రీకరించే ఈ సాంగ్ ఈ మూవీకి హైలెట్ సాంగ్ అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: