ఇక అందుకు తోడు మెగాస్టార్ చిరంజీవి నటన, మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో కోడి రామకృష్ణ చెప్పారు. ముందు నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి చిరంజీవితో ఒక మంచి గ్రాఫిక్స్ సినిమా చేద్దాం అని కోడి రామకృష్ణతో అన్నారట. అందుకు కోడి రామకృష్ణ చిరంజీవి కమర్షియల్ స్టార్ కాబట్టి తన దగ్గర ఒక డబుల్ రోల్ హీరో పాత్ర ఉన్న స్టోరీ ఉంది అని, చిరంజీవితో ఆ సినిమా చేద్దామని అన్నారట. కానీ శ్యాంప్రసాద్ రెడ్డి మాత్రం గ్రాఫిక్స్ ఓరియంటెడ్ సినిమానే చేద్దాం అని అన్నారు. ఈ విషయంపై చిరంజీవిని సంప్రదించి ఈ సినిమా కోసం తను ఒక కొత్త నటుడిలాగా కష్టపడాలి అని అన్నారట కోడి రామకృష్ణ.
అయితే చిరంజీవి పర్వాలేదు అని, అంతే కష్టపడతాను అని అన్నారట. దాంతో కోడి రామకృష్ణ సోషియో ఫాంటసీ అయిన అంజి కథని సిద్ధం చేశారు. మూవీ షూటింగ్ కి చాలా సమయం పట్టింది. ఆ మూవీ షూటింగ్ టైంలో చిరంజీవి ఇంకా కొన్ని సినిమాలు కూడా చేశారట. కేవలం ఒక్క క్లైమాక్స్ కోసమే రెండు సంవత్సరాలు పట్టింది. ఆ రెండు సంవత్సరాలు సినిమా షూటింగ్ కోసం చిరంజీవి ఒకటే షర్ట్ వేసుకున్నారట. బాక్సాఫీస్ దగ్గర ఫలితం ఎలా ఉన్నా కూడా ఆ సినిమాకి సంబంధించిన ప్రతీ వారు ఇంత కష్టపడ్డారు. కాబట్టి సినిమా విడుదల అయ్యి 17 సంవత్సరాలు అవుతున్నా కూడా తెలుగు ప్రేక్షకులకు అంజి సినిమా ఇప్పటికీ గుర్తుంది. ఎప్పటికీ గుర్తుంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి