వరుస ప్లాపులతో సత మతం అవుతున్న యూత్ స్టార్ నితిన్ గతేడాది "భీష్మ" సినిమాతో మంచి హిట్ ని అందుకున్నాడు.ఆ సినిమా హిట్ తో మంచి జోష్ లో వున్న నితిన్ ఒక సంవత్సరం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ ఏడాది "చెక్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక మళ్ళీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక వెంటనే మళ్ళీ నితిన్  రొమాంటిక్ ఎంటర్‌టైనర్ "రంగ్ దే"తో మళ్ళీ రాబోతున్నాడు. ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌, లిరికల్ సాంగ్స్ వీడియోలకు అనూహ్య స్పందన లభిస్తోంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా ఈ నెల 26న విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర రిలీజ్ ఈవెంట్‌ని బుధవారం రాత్రి రాజమండ్రిలో గ్రాండ్‌గా నిర్వహించారు.


ఇక ఈ సందర్బంగా హీరో నితిన్ ఈ కథ కీర్తీని ఆదర్శం గా తీసుకొని రాశారు అని చెప్పాడు. నితిన్ మాట్లాడుతూ " 'రంగ్ దే` సినిమా మార్చి 26న మీ ముందుకొస్తోంది. ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఖచ్చితంగా మీ అందరికి బాగా నచ్చుతుంది. ఈ బ్యానర్‌లో నాకిది మూడవ సినిమా. అ ఆ, భీష్మ ఇప్పుడు `రంగ్ దే`. సో ఆ రెండు సినిమాల్లాగే ఈ సినిమా కూడా ఆడాలని కోరుకుంటున్నాను. రాజమండ్రికి లాస్ట్ టైమ్ `భీష్మ` షూటింగ్‌కి వచ్చాను. సాంగ్ షూట్ కోసం వచ్చాను. ఆ సినిమా హిట్టయింది. `రంగ్ దే` కోసం మళ్లీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. సెంటిమెంట్‌గా మళ్లీ ఆడాలని కోరుకుంటున్నాను. మా ప్రొడ్యూసర్ వంశీగారు ఇక్కడికి రాలేకపోయారు. వెంకీ అట్లూరి ఎప్పటి నుంచో నాకు మంచి స్నేహితుడు. తను సినిమా బాగా చేశాడు. డీఎస్పీగారితో తొలిసారి వర్క్ చేశాను. చాలా అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఈ సాంగ్స్ చాలా రోజుల వరకు గుర్తుంటాయి. సినిమా రిలీజ్ అయ్యాక ఈ పాటలు చాలా పెద్ద హిట్ అవుతాయి. థ్యాంక్యూ దేవీ సర్.. అమేజింగ్ సాంగ్స్ ఇచ్చారు. మన కాంబో ముందు ముందు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. కీర్తీ చాలా మంచి నటి. ఈ సినిమాలో చాలా బాగా చేసింది. తన రియల్ క్యారెక్టర్ అదే. అందరిని టార్చర్ పెడుతూ వుంటుంది. అది చూసి స్ఫూర్తిగా తీసుకుని వెంకీ ఈ కథ రాశారు. మార్చి 26న థియేటర్‌లో ఈ సినిమా చూడండి. " అని నితిన్ చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: