
"బాహుబలి 2" సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులని బద్దలు కొట్టి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1600 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఆ సినిమాని చెక్కిన రాజమౌళి ప్రస్తుతం "ఆర్ ఆర్ ఆర్ " సినిమాని కూడా చెక్కుతున్నాడు. ఇక 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా చిత్రీకరణ చివరిదశకు చేరుకోవడంతో చిత్రబృందం ఇప్పుడు వ్యాపార లెక్కల్లోకి దిగిపోయింది. ఎక్కడ, ఎవరు విడుదల చేయాలి, ఎంతకు అమ్మాలి లాంటివి త్వరగా త్వరగా తేల్చేస్తోంది టీమ్.
ఇక భారీ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న నేపథ్యంలో వివిధ భాషల హక్కుల లెక్కలు తేల్చేస్తున్నారు. మొన్నటికి మొన్న తమిళ వెర్షన్ రిలీజ్ హక్కుల లెక్క తేలిపోయింది. కన్నడ వెర్షన్ లెక్క కూడా తేలిపోయిందన్నారు. ఇప్పుడు బాలీవుడ్ లెక్క తేల్చేశారు. సినిమా కు సంబంధించిన నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ దక్కించుకుంది.దీంతోపాటు అన్ని భాషల ఎలక్ట్రానిక్, డిజిటల్, శాటిలైట్ రైట్స్ కూడా పెన్ స్టూడియోస్ కైవసం చేసుకుంది.
ఈ మేరకు చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. బాలీవుడ్ లో ఇటీవల డీల్ ఓకే చేసుకున్న పెద్ద పెద్ద సినిమాల కంటే ఎక్కువకే ఈ సినిమా రైట్స్ ఓకే అయ్యాయంట. బాహుబలి 2 ను మించి ఈ సినిమాను అక్కడ విడుదల చేసేలా ఇప్పటి నుండే పెన్ స్టూడియోస్ ప్రయత్నాలు చేస్తోందట.ఇక ఇప్పటిదాకా ఇండియాలో బాహుబలి 2 సినిమా రికార్డ్స్ ని ఏ సినిమా టచ్ చెయ్యలేదు.మరి ఈ సినిమా ఎంతమేర వసూలు చేస్తుందో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...