ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవన్ కు సాన్నిహిత్యం బాగా పెరిగిన తరువాత ఈ నమ్మకాలు బాగా పెరిగాయి అంటారు. త్రివిక్రమ్ సూచన మేరకు కొంతకాలం క్రితం నుండి తన శరీరం పై యజ్ఞోపవీతం వేసుకుంటున్నాడు అనే వార్తలు కూడ ఉన్నాయి. అంతేకాదు పవన్ రాజకీయాలలోకి రాకముందు ఒక పెద్ద హోమం చేసాడు అని కూడ అంటారు.
లాక్ డౌన్ సమయంలో పవన్ గంటల తరబడి ధ్యానం చేసుకుంటూ తన ఫామ్ హౌస్ లో గెడ్డం పెంచుకున్న విషయం తెలిసిందే. ఇక ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు పవన్ ఉంగరాలతో రావడంతో మీడియా కెమెరాల దృష్టి అంతా పవన్ ఉంగరాల పై పడింది. ముఖ్యంగా పవన్ చేతి వేలికి ఉన్న నాగ అంగుళియం వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. సాధారణంగా జాతక రీత్యా ఏదైనా దోషనివారణ కోసం ఇలాంటి నాగ అంగుళియాన్ని ధరిస్తారు అని అంటారు.
అయితే ఇలాంటి నాగ అంగుళీయం ధరించిన తరువాత చాల నియమ నిష్టలు పాటించాలి. రాజకీయాలలో ప్రజలు అవకాశం ఇస్తే తాను ముఖ్యమంత్రిని అవుతాను అని చెపుతున్న పవన్ ఆ లక్ష్యం కోసం ఇలాంటి నాగ అంగుళియం ధరించాడా లేదంటే ఈవారం విడుదల కాబోతున్న ‘వకీల్ సాబ్’ రికార్డ్ కలక్షన్స్ కు ఎలాంటి అడ్డంకులు లేకుండా పరిస్థితులు సహకరించాలని పవన్ ఇలాంటి ఉంగరం చేతికి పెట్టుకున్నాడా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో అనేక ఊహాగానాలు వస్తున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి