సాధారణంగా ఒకప్పుడైతే చిన్న హీరోలు తమ సినిమాలు విడుదలైనప్పుడు ఇక వివిధ బుల్లితెర కార్యక్రమాల్లో తమ సినిమాలకు ప్రమోషన్స్ నిర్వహించుకునేందుకు వస్తూ ఉండేవారు అనే విషయం తెలిసిందే. కానీ నేటి రోజుల్లో సినిమా విజయానికి ప్రమోషన్స్ ఎంతగానో తోడ్పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు.  ఈ మధ్యకాలంలో మా టీవీలో ప్రసారమయ్యే స్టార్ మ్యూజిక్  కార్యక్రమానికి ఏకంగా నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు గెస్ట్ గా.  ఇకా ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా విడుదల కావడంతో ఈ సినిమాకి సంబంధించి  కూడా చిత్రబృందం ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు  .



 ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన వకీల్ సాబ్ సినిమా ఏకంగా విజయం దిశగా దూసుకుపోతుంది దాదాపు మూడేళ్ల నిరీక్షణ తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా కావడంతో అటు పవన్ అభిమానుల్లో కూడా భారీ అంచనాలు పెరిగిపోయాయి.ఈ క్రమంలోనే థియేటర్లకు బారులు తీరి మరి ప్రస్తుతం  సినిమా చూసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఇటీవలే వకీల్ సాబ్ చిత్రబృందం  అందరూ కూడా ఈటీవీ లో ప్రసారమయ్యే క్యాష్ అనే ప్రోగ్రాం కి గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు.  సాధారణంగా షో కి ఎవరైనా గెస్టు ఎంట్రీ ఇచ్చారు అంటే వాళ్ళ తో ఒక ఆట ఆడుకుంటుంది యాంకర్ సుమ.



 అయితే ఇటీవలే క్యాష్ ప్రోగ్రాం కు సంబంధించి విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో లో భాగంగా సుమ పెట్టిన ఒక టాస్క్ కాస్త ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది. సాధారణంగా ప్రతి ఎపిసోడ్ లో కూడా సుమ  ఇంటర్వ్యూ చేస్తూ సెలబ్రిటీలు చెప్పిన విషయాలు బ్రేకింగ్ న్యూస్ అంటూ చెబుతూ ఉంటుంది ఇటీవలే ఈ క్రమంలో భాగంగా సుమ మరోసారి విచిత్రమైన టాస్క్ రహో సిద్ధమైంది. ఈ క్రమంలోనే గెస్ట్ గా ఇచ్చిన ఒక కంటెస్టెంట్ ఇక మధ్యలో ఈ బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటూ ప్రశ్నించగా...  వకీల్ సాబ్ బ్రేకింగ్ న్యూస్ ఇది ఐటెం సాంగ్ లాంటిది అంటూ చెప్పుకొచ్చిచ్చింది సుమా.

మరింత సమాచారం తెలుసుకోండి: