అంతేకాదు శేషు తమ ఫ్యామిలీ ఫ్రెండ్ లా మారిపోయాడని అంటూ రేణు అనేక సందర్భాలలో చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు అప్పట్లో రేణు దేశాయ్ కామెంట్స్ కు షాక్ అయిన విషయం తెలిసిందే. ఈమధ్య అడవి శేషు రేణు దేశాయ్ ఇంటికి వెళ్ళి ‘అకీరా' ఆద్యాల తో సరదాగా కొంత సమయం గడిపి వచ్చాడట. ఈ సందర్భానికిసంబంధించిన ఫోటోలను రేణు దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు మీడియా లో వైరల్ గా మారాయి.
ఈ ఫోటోలో అకీరా శేషు మాస్కులు పెట్టుకుని కరోనా జాగ్రత్తలు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. మధ్యలో పవన్ కూతురు ఆద్యా మెడను శేషు పట్టుకుంటే ఊపిరాడనట్లు ఆమె ఎక్స్ ప్రెషన్ పెట్టింది. ఈ ఫోటోలను చూసి పవన్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తూ అకిరా చరణ్ ల మధ్య ఇలాంటిబాండింగ్ ను తెలియచేసే ఫోటోలను కూడ రేణు షేర్ చేస్తే బాగుంటుంది అని కామెంట్ చేస్తున్నారు.
అడవి శేషు ప్రస్తుతం నటిస్తన్న ‘మేజర్’ మూవీలో అకిరా నందన్ చేత ఒక ప్రత్యేక పాత్రను చేయించాలి అన్న ప్రయత్నాలు జరిగి నప్పటికీ ఈ విషయమై రేణు దేశాయ్ నుండి సరి అయిన స్పందన రాలేదు అని టాక్. మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్నా విషయం తెలిసిందే 6.4 అడుగుల ఎత్తుతో చూడ చక్కని రూపంతో ఉన్న అకిరా త్వరలో హీరోగా ఎంట్రీ ఇస్తే చూడాలి అన్నది పవన్ అభిమానుల కోరిక..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి