
రోజురోజుకు కరోనా కేసులు ఎక్కువవడంతో ప్రతి ఒక్కరు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. ఇక ఈ తరుణంలోనే వ్యాక్సిన్ కోసం ప్రస్తుతం మన భారతదేశం ఎన్ని ఇబ్బందులు పడుతోందో ప్రతి రోజూ చూస్తూనే వున్నాం. ఇక ఈ నేపథ్యంలోనే భారత దేశంలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితులను చూసి ఆవేదన చెందింది ఈ గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. ఇక ఈమె భారతదేశంలో నెలకొన్న పరిస్థితులను చూసి ,భారత దేశానికి సహాయం చేయండి అంటూ అమెరికా ప్రభుత్వాన్ని కోరింది ఈ ముద్దుగుమ్మ..
మన భారతదేశంలో మహమ్మారి మరోసారి తన పంజా విసిరింది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ అందరిలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇక నిత్యం చోటుచేసుకుంటున్న వేలాదిమంది మరణాల కారణంగా అందరిలో ఆందోళన కలుగుతోంది.ఇక చాలామంది ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలోనే భారతదేశంలో చోటుచేసుకుంటున్న తాజా పరిస్థితులపై బాగా ఎమోషనల్ అయింది ప్రియాంక చోప్రా..
ప్రస్తుతం ఈమె అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ను ప్రేమించి, పెళ్లాడి , అక్కడే సెటిల్ అయిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం తన భర్తతో కలిసి అక్కడే ఉంటోంది. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె ప్రజెంట్ జరుగుతున్న సామాజిక మాధ్యమాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.. ఈ మేరకు కరోనా కల్లోలంలో చిక్కుకున్న భారత దేశానికి సహాయం అందించాలని అమెరికా అధ్యక్షుడిని అలాగే ఇతర ప్రభుత్వ అధికారులను సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేసింది ప్రియాంక..
భారత దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. వారికి కావలసిన వ్యాక్సిన్ సరిగా అందడం లేదు. దయచేసి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ను భారత్ కు సరఫరా చేయాలని, అమెరికా ప్రభుత్వ అధికారులను కోరుకుంటూ ప్రియాంక ట్వీట్ చేసింది.. ఇక ఇప్పటికే భారత ప్రభుత్వానికి అమెరికా ప్రభుత్వం తోడుంటానని హామీ కూడా ఇచ్చింది. ఇక ఈ నేపథ్యంలోనే 550 మిలియన్ల ఆస్ట్రాజనెకా వ్యాక్సిన్ లను ఆర్డర్ చేసిందని, ఇక అమెరికాకు కావలసిన దానికంటే ,ఎక్కువ వ్యాక్సిన్లు వారి వద్ద ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం భారత్ చాలా ఇబ్బందుల్లో ఉంది. అందుకే వెంటనే ఇండియాకు ఈ వ్యాక్సిన్ లను పంపించగలరా..? అంటూ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడన్ కు రిక్వెస్ట్ చేసింది ప్రియాంకచోప్రా..