టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ దశాబ్ద కాలంపాటు తెలుగు నెంబర్ ఒన్ హీరోగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఇక ఆ తరువాత రాజకీయల్లోకి ఎంట్రీ ఇచ్చి కొంత కాలం సినిమాలకు దూరమైన చిరు మళ్ళీ తన 150వ చిత్రం " ఖైధి నెంబర్ 150 " తో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ సినిమాతో మెగాస్టార్ తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఇక చిరుకి బయట మాత్రమే కాక సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగే ఉంది. ట్విట్టర్ లో తాజాగా మెగాస్టార్ ఒన్ మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు.

 అయితే చిరు ఇతర స్టార్ హీరోలతో పోలిస్తే ఆలస్యంగా ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికి, తక్కువ టైమ్ లోనే ఒన్ మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకొని సరికొత్త రికార్డు సృష్టించాడు. దీంతో మెగా అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఇక చిరు నటిస్తున్న సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న "ఆచార్య " మే 13న విడుదల కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. 

ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత మెగాస్టార్ "లూసిఫర్ " రీమేక్ లో నటించనున్నాడు. ఈ మూవీ కి సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి అయ్యాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీతో పాటు " వేదాలం " రీమేక్ కూడా లైన్లో ఉంది. వీటితో పాటు బాబీ దర్శకత్వంలో కూడా ఓ సినిమాకు కమిట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి మెగాస్టార్ వరుస సినిమాలను లైన్లో పెట్టి అభిమానుల్లో సరికొత్త జోష్ నింపుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: