స్టార్స్ తో పాటు స్టార్ కిడ్స్ కు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. వారు ఏం చేస్తుంటారు, వారి అలవాట్లు ఏంటి, ఏదైనా సినిమాలో కనిపిస్తారా అన్న విషయాలు తెలుసుకోవడానికి ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే తరహాలో స్టార్ హీరో మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణపై గురించి తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. మహేష్ బాబు - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన '1 నేనొక్కడినే' చిత్రంలో ప్రిన్స్ వారసుడు గౌతమ్ కృష్ణ తెరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన ఫలితాలను అందుకోలేక పోయినప్పటికీ, మహేష్ బాబు ఎప్పటిలాగే తన నటనతో ప్రేక్షకులను అలరించగా, ఆయన తనయుడు గౌతమ్ తన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని అంత చిన్న వయసులోనే భారీగా ఫ్యాన్స్ ను తన అకౌంట్లో వేసుకున్నాడు. కానీ ఆ తర్వాత మాత్రం ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు గౌతమ్.
  ప్రేక్షకులు మాత్రం తమ చిన్న ప్రిన్స్ ను తెరపై చూసేందుకు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.  అయితే ఇప్పుడు లాక్ డౌన్ తో వచ్చిన గ్యాప్ లో తనయుడు గౌతమ్ తో షార్ట్ ఫిలిం ప్లాన్ చేస్తున్నారట సూపర్ స్టార్ మహేష్ బాబు. సాలిడ్ కాన్సెప్ట్ ఒకటి నచ్చడంతో అందులో నటించేందుకు గౌతమ్ కృష్ణ కు తండ్రి మహేష్ పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో గౌతమ్ కృష్ణ ఎలాగో హీరోగా పరిచయం అవుతారన్నది తెలిసిందే. అయితే అనూహ్యంగా మంచి కాన్సెప్ట్ ఉన్న షార్ట్ ఫిల్మ్ ప్రపోజల్ ఒకటి రావడంతో అది నచ్చిన ప్రిన్స్ ఆ షార్ట్ ఫిలిం లో గౌతమ్ ను ప్రధాన పాత్రలో నటింప చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.  ఇందులో విద్యార్థి దశలో పిల్లలు ఎదుర్కొనే ఒత్తిడిపై ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్త ఎంత వరకు కరెక్ట్ అన్నది తెలియదు.
  ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్ ఏ రేంజ్ లో ఆదరణ పొందుతుందో అందరికీ తెలిసిందే. కాబట్టి మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణ షార్ట్ ఫిలిమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అతని క్రేజ్ కు ఏ మాత్రం లోటు ఉండదని అంటున్నారు ప్రిన్స్ అభిమానులు. మరి నిజం గానే చిట్టి ప్రిన్స్ గౌతమ్ కృష్ణ షార్ట్ ఫిలిమ్ తో వస్తారో లేదో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: