సినిమాల మీద మక్కువతో క్లాప్ అసిస్టెంట్ గా కెరీర్ మొదలు పెట్టిన గంటాా నవీన్ కుమార్ అనంతరకాలంలో నాచురల్ స్టార్ నానిగా అవతరించాడు. క్లీన్ ఇమేజ్ తో ఫ్యామిలీ సినిమాలు చేస్తున్న ఆయన సొంతగా వాల్పోస్టర్ సినిమా అనే ఒక నిర్మాణ సంస్థ స్థాపించి వరుసగా సినిమాలు నిర్మిస్తూ వెళుతున్నాడు. ఇప్పటికే ఆయన బ్యానర్ నుంచి వచ్చిన ఆ అనే సినిమా ద్వారా ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత హిట్ అనే సినిమా ద్వారా శైలేష్ కొలను దర్శకుడిగా తన సత్తా చాటుకున్నాడు. ప్రస్తుతానికి ఇదే బ్యానర్ నుంచి హిట్ సినిమాకి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు.. 


ఇక తాజాగా ఈ బ్యానర్ నుంచి నాలుగో సినిమా ప్రకటన ఎలాంటి హడావుడి లేకుండా వచ్చేసింది. అయితే నాని ప్రొడక్షన్ సంస్థ నాలుగో సినిమా ప్రకటన హడావిడిగా లేకుండా రావడం పెద్ద విషయం కాదు. కానీ ఆ సినిమాకి దర్శకత్వం వహించేది నాని సోదరి మరి. ఈ సినిమాకి నాని సోదరి దర్శకత్వం వహిస్తున్న విషయమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే సినిమా వాళ్లకు సంబంధించి తమ వారసులు ఎవరైనా సినీ రంగప్రవేశం చేస్తుంటే భారీ ఎత్తున రకరకాల ప్రమోషన్లు చేస్తూ ఉంటారు. కానీ తన సోదరి దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఈ సినిమా గురించి పెద్దగా ఎలాంటి ప్రచారం చేయకుండానే సైలెంట్ గా దీనిని వదిలేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  సొంత అక్క దర్శకురాలిగా మారుతుంటే నాని మంచి హడావుడి చేస్తారని అందరూ భావిస్తారు. కానీ అలాంటిది ఏమీ లేకుండా చప్పగా జనానికి చెప్పేయడం ఏంటో  మరి!


నాని సోదరి దీప్తి గంటా ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. నిజానికి దీప్తి గతంలోనే అనగనగా ఒక నాన్న అనే షార్ట్ ఫిలిం ద్వారా దర్శకురాలిగా పరిచయం అయ్యారు. నాన్న పాత్రలో దివంగత ఫిలిం జర్నలిస్ట్ తుమ్మల నరసింహారెడ్డి నటించి అందరిని మెప్పించారు.. ఆ సంగతి పక్కన పెడితే మీట్ క్యూట్  అనే సినిమా ద్వారా ఇప్పుడు ఆమె ఫీచర్ ఫిలిం దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఇక ఈ సినిమాకి నిర్మాతగా నాని భార్య వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: