టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. వెండితెరకి మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా..పలు బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ హీరో గా తనకంటూ ప్రత్యేక అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు చరణ్.డాన్స్, నటనలో తనకంటూ ఇక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న చరణ్.. ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో నటించిన రంగస్థలం సినిమాతో నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కాడు. ఈ సినిమాలో చరణ్ అద్భుతమైన నటనను కనబర్చి.. విమర్శలకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న rrr అనే భారీ పాన్ ఇండియా సినిమాలో..

 అల్లూరి సీతారామరాజు అనే పాత్రను పోషిస్తున్నాడు ఈ మెగా హీరో. అంతేకాదు తన కెరీర్ లో మొదటి సారి మరో అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ 
తో కలిసి ఈ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఇదిలా ఉంటె సాధారణంగా చరణ్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది.ఇందులో భాగంగా తాజాగా ఓ  ముగ్గురు రామ్ చరణ్ అభిమానులు చేసిన ఓ పని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. తమ అభిమాన హీరో రామ్ చరణ్ ని కలవడానికి ఓ ముగ్గురు అభిమానులు  ఏకంగా 231 కిలో మీటర్లు నడుచుకుంటూ వచ్చారు.


తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సంధ్యా జయరాజ్,రవి, వీరేష్ అనే ముగ్గురు అభిమానులు రామ్ చరణ్ ని కలవడానికి జోగులాంబ గద్వాల్ నుంచి హైదరాబాద్ కి దాదాపు 231 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారు.దీనికి ఏకంగా 4 రోజుల సమయం పట్టింది.ఇక ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ ఆ ముగ్గురు అభిమానులను వెంటనే కలుసుకొని..వారిని అక్కున చేర్చుకోవడంతో ఆ అభిమానుల ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. ఇక వీటికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియో లు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.మొత్తానికి అభిమానుల కోరికను తీర్చిన మన రామ్ చరణ్ కి సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు మెగా అభిమానులు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: