ఇలాంటి పరిస్థితులలో ఈ విలక్షణ రచయితకు పవన్ కళ్యాణ్ నుండి సపోర్ట్ లభించింది అన్న వార్తలు వస్తున్నాయి. వక్కంతం పవన్ ను దృష్టిలో పెట్టుకుని ఒక పవర్ ఫుల్ కథను వ్రాసినట్లు టాక్. ఈ కథ పవన్ భావజాలానికి చాల దగ్గరలో ఉండటంతో పవన్ ఆకథను బాగా ఇష్టపడ్డాడని తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాల సంఖ్య చాల ఎక్కువగా ఉండటంతో ఇప్పట్లో వక్కంతం వంశీకి డేట్స్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో పవన్ వక్కంతంకు ఒక రాజీ మార్గాన్ని సూచించినట్లు తెలుస్తోంది. తనకోసం తయారు చేసిన ఈ స్క్రిప్ట్ ను నితిన్ రేంజ్ కి అనుగుణంగా మార్పులు చేసి అతడితో సినిమా తీయమని సలహా ఇవ్వడంతో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. నితిన్ ఇప్పటికే ఎన్ఆర్ఐ ఎంటర్ టైన్ మెంట్ సంస్థకు ఒక మూవీ చేయవలసి ఉన్న నేపధ్యంలో ఇప్పుడు పవన్ సహకారంతో నితిన్ వక్కంతం కాంబినేషన్ మూవీ సెట్ అయింది అన్న ప్రచారం జరుగుతోంది.
పవన్ ను నితిన్ దేవుడిచ్చిన అన్నయ్యగా భావిస్తూ ఉంటాడు. నితిన్ సినిమాలలో ఎదోవిధంగా ఎదో ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన పరోక్ష ప్రస్తావన ఉంటుంది. ఇలాంటి నేపధ్యంలో నితిన్ కెరియర్ కు ఒక మంచి సినిమా రావాలి అన్న ఉద్దేశ్యంతో ఈ సహాయం చేసి ఉంటాడు అనుకోవాలి. ఏది ఏమైనా ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్న నితిన్ కు వక్కంతం వంశీ మూవీ కెరియర్ బ్రేక్ ఇస్తుందేమో చూడాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి