
ఈ హీరోయిన్ ఎవరో కాదు గీతాంజలి..బాల నటిగా, నర్తకిగా అడుగుపెట్టిన ఈమె తర్వాత హీరోయిన్ గా, ఆ తరువాత అక్కగా, అమ్మగా, ఆ తర్వాత కాలంలో స్టార్ హీరోలకు బామ్మ పాత్రలో కూడా నటించి అందరినీ మెప్పించింది. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 60 సంవత్సరాలు కొనసాగింది. 1947 వ సంవత్సరం కాకినాడలో జన్మించిన గీతాంజలి.. తన అక్క స్వర్ణ నాట్యం నేర్చుకోవడం బాగా గమనించేది. అలా తన మూడు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు నాట్యంలో ప్రావీణ్యం పొంది , తన నాలుగవ యేట ప్రదర్శనలు ఇవ్వడానికి తన అక్కతో కలిసి వెళ్ళేది.
అయితే గీతాంజలి అసలు పేరు మణి. అయితే ఒక హిందీ చిత్రం టైటిల్ కూడా ఇదే ఉండడంతో, ఆ సినిమా డైరెక్టర్ ఆమె పేరును గీతాంజలిగా మార్చాడు. హిందీలో దాదాపు 12 చిత్రాల్లో నటించింది. ఇక తెలుగు, తమిళ, కన్నడ ,మలయాళం చిత్రాలలో కూడా నటించి, తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది. జగపతి బాబు, ప్రియమణి , ఆహుతి ప్రసాద్, ఝాన్సీ వంటి ప్రముఖులు కలసి నటించిన పెళ్లయిన కొత్తలో సినిమాలో కూడా గీతాంజలి నటించింది. ఇక ఈ సినిమాలో ఆహుతి ప్రసాద్ కు భార్యగా, జగపతి బాబు బామ్మ క్యారెక్టర్ లో నటించి అందరి మన్ననలు పొందడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఇక అలా నాలుగు సంవత్సరాల వయసులోనే నర్తకిగా మారింది గీతాంజలి.