టాలీవుడ్ సీనియర్ నటి అయిన ఛార్మి కౌర్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయం అవసరం లేదు. ముంబైకి చెందిన ఈ  హాట్ బ్యూటీ చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీకి పరిచయమైందట .తొలిసారిగా 2001లో నీ తోడు కావాలి అనే సినిమాతో పరిచయం కాగా ఈ సినిమా తనకు అంత విజయం ఇవ్వలేదు. ఆ తర్వాత తమిళంలో పలు సినిమాలలో నటించిన  మంచి విజయం రాలేదు. ఇక శ్రీ ఆంజనేయం, మాస్, చక్రం, లక్ష్మి, రాఖీ, జ్యోతి లక్ష్మి వంటి సినిమాలతో తన పాత్రలకు మంచి గుర్తింపు తెచ్చుకుందని సమాచారం. ఇదిలా ఉంటే దర్శకుడు పూరి తో సంబంధం గురించి కొన్ని విషయాలు పంచుకుందట ఛార్మి.2015లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జ్యోతిలక్ష్మి సినిమాలో నటించగా ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైందని సమాచారం. సినిమాలకు దూరం కాగా నిర్మాతగా బాధ్యతలు చేపట్టినట్లు తెలుస్తుంది. అది కూడా స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ తన నిర్మాణంలోనే భాగస్వామిని చేశాడని సమాచారం

ఇక పూరి పేరుమీద ఉన్న కంపెనీ బాధ్యతలన్నీ ఛార్మినే చూసుకుంటుందని గతంలో  అందరికి తెలిసిన విషయమే.. ఇక తన సినిమాలకు ప్రొడక్షన్ పనులలో కూడా సహాయ పడుతుందట ఛార్మి. ఇక అదే సమయంలో తమ మధ్య సన్నిహితం ఎక్కువగా ఉండటంతో  వీరి మధ్య అస్సలు ఏముందో అని టాలీవుడ్ లో  వీరి  విషయం తెగ హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా ఈ విషయం గురించి ఛార్మి కూడా నేరుగా స్పందించిందని సమాచారం.

తమ మధ్య ఉన్నది ఓన్లీ ప్రొఫెషనల్ బంధమని.. కేవలం తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని తెలిపిందట ఛార్మి ఇక తమ మధ్య స్నేహం గురించి ఎవరు ఏమి మాట్లాడుకున్న అస్సలు పట్టించుకోనని క్లారిటీ ఇచ్చిందట ఛార్మి. అంతేకాకుండా మేమిద్దరం మంచి స్టార్ హోదా లో ఉన్నందుకు ఇటువంటి పుకార్లు వినిపిస్తునే ఉంటాయని చెప్పిందట. ఇప్పుడు నేను ఎంత చెప్పినా ఎవ్వరు వినరని అందుకే వీటి గురించి వివరణ కూడా ఇవ్వాల్సిన అవసరం నాకు లేదని తేల్చి చెప్పేసిందట ఛార్మి.

మరింత సమాచారం తెలుసుకోండి: