
ఈ సినిమాలో రాఘవ హీరోగా నటించారు. స్రవంతి రవి కిషోర్ నిర్మించిన నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి ఇళయరాజా చక్కని పాటలు అందించాడు. ముఖ్యంగా మాట రాని మౌనమిది... సుమం ప్రతి సుమం.. ఇలాంటి ఎన్నో పాటలు ఇప్పటికీ అక్కడక్కడా ప్రేక్షకులు వింటూనే ఉంటారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శాంతిప్రియకు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. ఇక ఈమె ఎవరో కాదు అలనాటి తార భానుప్రియకు స్వయానా సోదరి.

యమపాశం ,నాకు పెళ్ళాం కావాలి , రక్తకన్నీరు, సింహస్వప్నం వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీకి గుడ్బై చెప్పేసి కోలీవుడ్ లోకి ప్రవేశించి , అక్కడ మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. వీరిది సొంత ఊరు రాజమండ్రి. 1999వ సంవత్సరంలో సిద్ధార్థ రాయ్ అనే ఒక నటుడిని వివాహం చేసుకుంది. కానీ దురదృష్టవశాత్తు 2004వ సంవత్సరంలో గుండెపోటుతో ఆయన మరణించారు. ఇక వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. ఇకపోతే ఆమె ఇటీవల తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి కాస్తా వైరల్ అవుతున్నాయి .అంతేకాదు నాటికీ నేటికీ ఈమెలో చాలా మార్పులు వచ్చాయి అని కూడా నెటిజన్లు చెబుతున్నారు.