అయితే వావ్ అనే కార్యక్రమంలో అటు ప్రేక్షకులకు తెలియని విషయాలను తెలియ చేయడమే కాదు ఒక అటు కామెడీని కూడా పంచి ప్రస్తుతం బుల్లితెరపై మంచి రేటింగ్ సొంతం చేసుకుంటున్నారు. ప్రతి వారం కూడా నలుగురు కొత్త సెలబ్రిటీలను పిలిచి వారితో వివిధ రకాల టాస్కులు ఆడిస్తూ వుంటారు సాయికుమార్. ఇటీవలే వావ్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ప్రోమోలో భాగంగా సంపూర్ణేష్ బాబు,హరితేజ, అనుదీప్, భార్గవి పిల్లయ్ సెలబ్రిటీలు వచ్చారు. ఈ క్రమంలోనే వారితో ఆసక్తికర టాస్కులు ఆడించాడు సాయికుమార్.
ఇక ఈ ప్రోమోలో భాగంగా సాయికుమార్ అక్కడ ఉన్న వ్యక్తులను కొన్ని క్విజ్ క్వషన్స్ అడుగుతాడు. ఇక ఈ క్రమంలోనే సంపూర్ణేష్ బాబు ఒక ప్రశ్న అడుగుతాడు. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఎవరు అనే ప్రశ్న అడుగుతాడు. సంపూర్ణేష్ బాబు వెంటనే రష్మిక వందన అని సమాధానం చెబుతాడు. మందన్న అనకుండా వందన అనడంతో అందరూ షాక్ అవుతారు. ఇక వెంటనే కల్పించుకున్న సాయికుమార్ రష్మిక పేరు ఒక్కసారి సిగ్గుపడుతూ చెప్పు అనగానే.. ఎంతో సిగ్గుపడుతూ రష్మిక అంటూ చెబుతాడు సంపూర్ణేష్ బాబు. సంపూ సిగ్గు చూసి సాయి కుమార్ సైతం అవాక్కవుతాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి