తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 19 మంది కంటెస్టెంట్ లు టైటిల్ కోసం పోటీ పడనున్నారు. నిన్నే షో హోస్ట్ నాగార్జున అందరినీ గ్రాండ్ వెల్కమ్ తో హౌస్ లోపలికి పంపించాడు. అయితే వెళ్లిన మొత్తం మెంబర్స్ లో కొంత మంది తెలుగు ప్రేక్షకులకు తెలియదనే చెప్పాలి. ఎక్కువగా బిగ్ బాస్ రియాలిటీ షో ను ఓన్ చేసుకుని అధిక టీఆర్పీ లు రావడానికి కారణం అవుతున్న మహిళా ప్రేక్షకులు మరియు ఇంట్లో ఉండే వారికి పెద్దగా తెలియదు. దీని కారణంగా షో మొదట్లోనే వాళ్ళు అంతా టైటిల్ కు దూరమయ్యే అవకాశాలే ఎక్కువని తెలుస్తోంది. వారిలో ముఖ్యంగా జస్వంత్ ఒక మోడల్ అని నాగార్జున చెప్పినప్పటికీ కుటుంబ ప్రేక్షకులకు మోడల్స్ గురించి పెద్దగా తెలిసే చాన్స్ ఉండదు. పైగా హౌజ్ లోనూ ఇతను అంత యాక్టివ్ గా ఉండలేదన్నది నిన్న ఎపిసోడ్ లో తెలిసింది.

ఇదే లిస్టులో పహీదా, లహరి శ్రీ, శ్వేత వర్మ ఉన్నారు. మరి వీరంతా అసలు ఎవరనేది ప్రేక్షకులకు తెలియాలంటేనే  సమయం పడుతుంది. అంతలోపు షో నుండి ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక అందరి దృష్టిలో ఆల్రెడీ ఉన్న వారు కొందరున్నారు. వీరికి ఇప్పటికే ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఉంది. కాబట్టి దీనికి తోడు వారి టాలెంట్ యాడ్ అయితే టైటిల్ పొందడానికి వీరు కూడా అర్హులే అని చెప్పవచ్చు. అలాంటి వారిలో ముందుగా యాంకర్ రవి, లోబో, షణ్ముఖ జస్వంత్, శ్రీ రామచంద్ర, సీరియల్ నటి ప్రియ, ఆర్జే కాజల్, సిరి, విశ్వ, నటరాజ్ మరియు అని మాస్టర్ లు ఉన్నారు. మరి వారికున్న ఫేం వారిని షో చూడగలిగేలా  చేయొచ్చు. కానీ ప్రేక్షకుల నుండి ఓట్లు పడాలంటే ఖచ్చితంగా టాలెంట్ చూపాల్సిందే.

ప్రస్తుతానికైతే అందరి దృష్టి రవి, సన్నీ, విశ్వ, షణ్ముఖ్ లపైనే ఉంది. షో సాగే కొద్దీ అంచనాలు తారు మారు అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సారి మేల్ కంటెస్టెంట్ లకు ధీటుగా లేడీ కంటెస్టెంట్ లు కూడా ఏమాత్రం తగ్గేలా లేరు. వారిలో ముఖ్యంగా సిరి, ఆర్జే కాజల్, శ్వేతా వర్మ, సరయు లు ముందు వరుసలో ఉన్నారు. వీరిలో ఒకరికి టైటిల్ గెలిచే సత్తా ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి చూద్దాం తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో మొదటిసారిగా ఫిమేల్ కంటెస్టెంట్ విన్నర్ అవుతారా.

మరింత సమాచారం తెలుసుకోండి: