టాలీవుడ్ లో క్రేజీ కపుల్ గా ఎప్పటికీ మిగిలి పోతారు అని అనుకున్న జంట అక్కినేని
నాగచైతన్య మరియు సమంత. వీరిద్దరూ సినిమాలలో ఒకరికి ఒకరు పరిచయం అయ్యి ప్రేమించుకుని పెద్దల అంగీకారం తో
పెళ్లి చేసుకున్నారు. ఈ
పెళ్లి కూడా ఎంతో ఘనంగా జరిగింది. అయితే ఈ జంటను చూసి ఎంతో ముచ్చట పడిన వారంతా ఆశ్చర్యపోయేలా, ఫ్యాన్స్ అంతా బిత్తరపోయేలా మూడు సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం ఇప్పుడు తెలుగునాట మాత్రమే కాదు దేశమంతటా కూడా ఎంతో నిరాశ పరుస్తుంది.
వీరి విడాకులు జరిగి నెలరోజులు పూర్తవుతున్న నేపథ్యంలో వీరిద్దరూ వాళ్ళ విడాకులకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. విడాకుల తర్వాత
సమంత కన్నీళ్లు పెట్టుకుందని ఈ మధ్యకాలంలో వెకేషన్ కు వెళుతూ ఆమె తన బాధను దిగమింగుకుంటు ఉందని చెబుతున్నారు. సినిమాల పరంగా ఆమె బిజీ కావాలని ప్రయత్నాలు చేస్తుండగా బాలీవుడ్లో ఇటీవల ఆమెకు ఓ
సినిమా అవకాశం రావడం విశేషం.
ఇక చైతు కూడా తన తదుపరి సినిమాల షూటింగ్స్ కి వెళ్ళిపోయాడు. అంతే కాదు ఓ ప్రముఖ ఓ టీ టీ సంస్థ లో కూడా ఆయన వెబ్ సిరీస్ చేసే ఆలోచన చేస్తున్నాడు. హార్రర్
జోనర్ లో ఈ సిరీస్ ఉండగా ప్రముఖ దర్శకుడు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో
నాగచైతన్య కూడా
సమంత లాగానే ఓ టీ టీ వైపు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆమెకు
సినిమా అవకాశాలు వచ్చినా రాకపోయినా ఓ టీ టీ లో చేయడం విశేషం.
బాలీవుడ్ లో ఇటీవల వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ లో నటించింది. ఇక ఆమె లాగానే చైతు కూడా అన్ని భాషలలో తన
మార్కెట్ ను పెంచుకోవడానికి ఓ టీ టీ లో చేయడం
సమంత నే ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది.