అల్లు రామలింగయ్య:
ముఖ్యంగా ప్రముఖ సీనియర్ హాస్యనటుడు అల్లు రామలింగయ్య డాక్టర్ గా హోమియోపతి వైద్యంలో ఆరితేరారు. ఇక ఈయన దగ్గర ప్రముఖ స్టార్ హీరోలు ఎన్టీఆర్ , ఏఎన్నార్ లు చికిత్సలు చేయించుకునేవారట. అంతేకాదు రాజమండ్రి లో ఈయన పేరు మీద హోమియోపతి కాలేజీ కూడా నిర్మించారు.
రాజశేఖర్:
యాంగ్రీ మెన్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో రాజశేఖర్ కూడా వైద్య వృత్తి చేస్తూ డాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన సినిమాల పై ఇంట్రెస్ట్ తో పలు సినిమాలలో నటించి ప్రముఖ నటి జీవితను ప్రేమించి వివాహం చేసుకున్నారు.. వీరికి ఇద్దరు కుమార్తెలు.. ఒక వీరు కూడా హీరోయిన్స్ గా సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు మరొక హాస్య నటుడు సునీల్ కుమార్తెకు కూడా రాజశేఖర్ వైద్యుడు గా ప్రాణం పోశాడు.
సౌందర్య:
కన్నడ ముద్దుగుమ్మ తెలుగునాట స్టార్ హీరోయిన్ గా ఎదిగిన విషయం తెలిసిందే. ఎంబిబిఎస్ మధ్యలోనే ఆపేసి హీరోయిన్ గా తన కెరీర్ ని మొదలు పెట్టింది. ఇక్కడ కెరియర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే విమాన ప్రమాదంలో మరణించింది.
అజ్మల్ అమీర్:
రంగం సినిమా లో సీఎం పాత్ర పోషించి అద్భుతమైన విలనిజం పండించిన ఈయన వైద్య శాస్త్రం చదివి నటనతో పాటు ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు.
సాయి పల్లవి:
ఫిదా సినిమా తో అందరి గుండెలను ఫిదా చేసిన ఈ ముద్దుగుమ్మ గుండె సంబంధిత వైద్య నిపుణురాలు గా పనిచేస్తోంది. ఒక వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరొకవైపు డాక్టర్ ప్రాక్టీస్ చేపట్టింది.
రూప కొడువయూర్:
ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలో సెకండాఫ్ లో వచ్చే ఈ భామ స్వతహాగా డాక్టర్ మాత్రమే కాదు మంచి డాన్సర్ కూడా.. అలాగే నటుడు భరత్ రెడ్డి అపోలో హాస్పిటల్ లో కార్డియాలజీ స్పెషలిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి