కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడి గా కొనసాగుతున్న అట్లీ - తళపతి విజయ్ కాంబినేషన్లో సినిమా అంటే  అభిమానులలో  అంచనాలు భారీగా పెరిగిపోతాయి.వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు పెద్దగా హిట్ అందుకోకపోయినా కూడా వసూళ్ల విషయం లో మాత్రం ఏ మాత్రం రికార్డ్స్ క్రియేట్ చేసాయి.అయితే అట్లీ అతి చిన్న వయస్సులోనే తన గురువు శంకర్ స్థాయిని అందుకునేందుకు శతవిధాలుగు ప్రయత్నాలు చేస్తున్నారు.తమిళ ఇండస్ట్రీలో ఒక స్టార్ దర్శకుడిగా అయ్యాడు అంటే వెంటనే వారి కలయికలో మరో సినిమా చేస్తుంటారు.అయితే వీరికి ప్పటినుంచో ఉన్న ఆచారం ప్రకారం ఏంటంటే డిజాస్టర్ వచ్చినా కూడా ఆ దర్శకుడితోనే సినిమా చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుందని వారు గట్టిగా నమ్ముతారట.

అయితే తాజాగా వీరి ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు కూడా మంచి హిట్ ను అందుకున్నాయి. ఇక ఇది నాలుగవ సినిమాసినిమా కూడా మంచి హిట్ సొంతం చేసుకుంటుంది అని అంటున్నారు వీరి అభిమానులు.అయతే విజయ్ 69వ సినిమా చేయడానికి అట్లీ ప్రణాళికలు రచిస్తున్నట్లుగా తెలుస్తుంది.వీరిద్దరి కాంబినేషన్లో మొదట తెరి అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ సినిమా తరువాత మెర్షల్ అనే సినిమా తీశారు.ఈ సినిమా మాత్రం అనుకున్న దానికంటే పెద్ద హిట్ సాధించింది.వీటి తరువాత బిగిల్ సినిమా చేశారు.ఇకపోతే ఈ సినిమా గురించి చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో మనందరికీ తెలిసిందే.విజయ్ తెలుగు సినిమాలు చేయడానికి అట్లీ సినిమాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి.దీనితో తరవాత అట్లీ కూడా తెలుగులో సినిమాలు చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు.

 ఇకపోతే నాలుగవ సారి ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ లో కలిసి సినిమా చేయబోతున్నాడు అట్లీ.ప్రస్తుతం విజయ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో బీస్ట్ అనే సినిమాను చేస్తున్నాడు.బీస్ట్ సినిమా తరువాత విజయ్ టాలీవుడ్ డైరెక్టర్ అయిన వంశీ పైడిపల్లితో ఒక సినిమా చేయనున్నాడు.దిల్ రాజు ఆ ప్రాజెక్ట్ ను నిర్మించనున్నారు.ఇకపోతే ఈ సినిమాకు విజయ్ 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.ఇకపోతే లోకేష్ కనగరాజ్ తో కూడా ఒక సినిమా చేయనున్నాడు విజయ్.వీటి తరువాత విజయ్ ఎవరితో సినిమా తీస్తాడు అనేది మాత్రం ఇంకా ఎవరికి తెలీదు.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ అట్లీ తో కలిసి సినిమా చేయనున్నారట.అయితే ఈ సినిమాను అట్లీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరపైకి తీసుకురానున్నారు.ఇదిలా ఉంటె అట్లీ హీరో షారుఖ్ ఖాన్ తో కూడా ఒక సినిమా చేసే పనిలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: