గత రెండు సంవత్సరాలు కరోనా పుణ్యమా అని 2021 లో సినిమాలు అన్నీ విడుదలకు క్యూ కట్టాయి. అనుకున్న విధంగా చాలా సినిమాలు థియేటర్లలో విడుదల అయినప్పటికీ అన్ని సినిమాలకు విజయం అయితే దక్కలేదు. కేవలం కొన్ని సినిమాలు మాత్రమే విజయాన్ని అందుకోగా దాదాపుగా ఎక్కువ సినిమాలు పరాజయం బాట పట్టాయి. ఈ సంవత్సరం ఇంకో మూడు రోజుల్లో ముగియనుంది. టాలీవుడ్ ఈ సంవత్సరాన్ని హిట్ సినిమాతో ముగించాలనుకుందో ఏమో తెలియదు కానీ గత వారం ఎన్నో అంచనాలతో థియేటర్లో విడుదల అయిన 'శ్యామ్ సింగరాయ్' మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది.

ఈ సినిమాలో ప్రతి ఒక్క విషయం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్య పాత్రధారులైన నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు అదరగొట్టేశారు. ఇందులో డైరెక్టర్ సాంకృత్యాన్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను మాత్రమే కాకుండా ఇండస్ట్రీ పెద్దలను సైతం మెప్పించాడు. ఇది డైరెక్టర్ గా తనకు రెండవ సినిమా మాత్రమే అయినా ఒక పరిణితి చెందిన విధంగా ప్రతి అంశాన్ని చాలా నీట్ గా ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.

ఇక ఈ సినిమాలో డైరెక్టర్ తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న పేరు మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ దే, ఇందులో పాటలకు అందించిన మ్యూజిక్ కు కన్నా కూడా నేపధ్య సంగీతం అద్భుతంగా ఇచ్చాడు. ఒక సీన్ కు అదే స్థాయిలో మ్యూజిక్ తోడైతే ఎలివేషన్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక్కడ కూడా సరిగ్గా అదే జరిగింది. ఈ సినిమా ద్వారా మిక్కీ కి వచ్చిన పేరుతో రానున్న రోజుల్లో టాప్ సంగీత దర్శకులుగా ఉన్న దేవి శ్రీ, థమన్, కీరవాణి లాంటి వారికి పోటీ వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. వీరి మ్యూజిక్ లో పదును లేకపోతే పక్కలో బల్లెంలా మారే ప్రమాదం ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: