ఆతరువాత వచ్చిన ‘రాజా విక్రమార్క’ ఎప్పుడు వచ్చిందో మరెప్పుడు వెళ్ళిపోయిందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో అతడికి ఊహించని అదృష్టం తలుపు తట్టింది. కన్నడ సూపర్ స్టార్ అజిత్ మూవీలో ఇతడు నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చినప్పటికీ చాలామంది ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అజిత్ లేటెస్ట్ మూవీ ‘వలిమై’ లో కార్తికేయన్ విలన్ గా నటిస్తున్నాడు అని తెలిసినప్పుడు అది ఒక సహాయ పాత్ర అనుకున్నారు.
అయితే ఈ మూవీ లేటెస్ట్ ట్రైలర్ లో అజిత్ పాత్రతో పాటు కార్తికేయ విలన్ పాత్రను కూడ హైలెట్ చేస్తూ విడుదల చేయబడ్డ టీజర్ ను చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అయ్యాయి. ఈ మూవీలో అజిత్ ను ఒక ఆట ఆడించే పాత్రలో కార్తికేయను ఎలివేట్ చేస్తున్నారు. టాప్ హీరో అజిత్ కూడ కార్తికేయ పట్ల అభిమానాన్ని చూపెత్తడమే కాకుండా అతడి పాత్రను పూర్తిగా ఎలివేట్ చేయమని చెప్పడం అతడి సహృదయతకు నిదర్శనం అంటూ కోలీవుడ్ మీడియా ప్రశంసలు కురిపిస్తోంది.
అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ ఈ సంక్రాంతికి తమిళనాట విడుదల కాబోతోంది. ఒమైక్రాన్ పరిస్థితులు వల్ల లాక్ డౌన్ లాంటి పరిస్థితులు లేకపోతే ఈ మూవీ విడుదల ఖాయం అంటున్నారు. అజిత్ సినిమా అంటే తమిళనాడులో ఒక రేంజ్ లో ఓపెనింగ్ కలక్షన్స్ ఉంటాయి. అలాంటి భారీ మూవీలో కార్తికేయ నటిస్తూ ఉండటంతో ఇక అతడి దశ మారిపోయినట్లే అంటున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి