యస్..ఇప్పుడు అందరు ఇదే మాట అంటున్నారు. మెగాస్టార్ అంటే ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఎన్నో సినిమాల్లో నటించి..కష్టపడి ఎవ్వరి హెల్ప్ తీసుకోకుండా ఇంత పెద్ద పోజీషన్ కి వచ్చిన చిరంజీవికి కుళ్ళు ఏంటి అని అనుకుంటున్నారా.. అవును ఆయనకు కుళ్లు ఉంది అని స్వయంగా ఆయనే చెప్పుకొచ్చారు. అంటే ఇక్కడ ఏదో పగ ప్రతీకారాలు తీర్చుకునే కుళ్ళు కాదండోయ్. ఫ్రెండ్లీ కుళ్లు. తన కొడుకుని సరదాగా ఆటపట్టించడానికి మాట్లాడిన పదం.

ప్రస్తుతం అందరు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక ఏ చిన్న పండగను అయినా సరే గ్రాండ్ గా జరుపుకునే మెగా ఫ్యామిలీ..ఈ సంక్రాంతి పండగను కూడా చాలా గ్రాండ్ గా అందరు కలిసి ఒక్క దగ్గరే జరుపుకుంటున్నారు. ఇక దీంతో మెగా ఫ్యామిలీ హీరో చేసే సందడి అంతా ఇంతా కాదు. చిన్న పిల్లల మారిపోయి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి..అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే భోగి పండుగ రోజు ఆరుబయట భోగి మంట ఏర్పాటు చేసి కూర్చున్న ఫ్యామిలీ మెంబర్స్‌ అందరి కోసం స్వయంగా మెగా స్టార్ చిరంజీవి తన చేతులతో దోశలు వేసి పెట్టారు. మెగా హీరో వరుణ్‌ తేజ్‌ కూడా వాళ్ళ కోసం చెఫ్‌ మాస్టర్ గా మారి ..ఇద్దరూ కలిసి రుచికరమైన దోశలు వేస్తూ వడ్డిస్తుంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేసారు. ఈ క్రమంలో చిరంజీవి వేసిన దోశ బాగా రాలేదు..దీంతో పక్కనే వరుణ్ వేసే దోశ బాగా వచ్చింది.. దీంతో అసూయపడ్డ  చిరంజీవి..వరుణ్ దోశను చెరిపేశాడు. చిరంజీవి మాట్లాడుతూ.." నా దోశ సరిగా రాలేదు, వాడి దోశ అంత బాగా వచ్చేసరికి నాకు కుళ్లు వచ్చేసింది. అయినా ఇది దోశ కాదు ఉప్మా" అంటూ వరుణ్‌ వేసిన దోశను చెడగొట్టాడు చిరు. ప్రస్తుతం ఈ దోశ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: