దిల్‌ రాజు 'ఇండియన్2' ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేసి తప్పుకున్నాక ఫిల్మ్ నగర్‌లో చాలా కామెంట్స్‌ వినిపించాయి. తెలుగులో భారీ సినిమాలు చేస్తోన్న దిల్‌ రాజు, మల్టీలింగ్వల్స్‌కి ఎందుకు దూరంగా ఉంటున్నాడనే ప్రశ్నలు వచ్చాయి. అయితే అప్పుడు వద్దనుకున్న పాన్ ఇండియన్‌ అప్పీల్‌ని ఇప్పుడు వరుస సినిమాలతో అందుకుంటున్నాడు. బ్యాక్‌ టు బ్యాక్ భారీ సినిమాలు చేస్తున్నాడు.

దిల్ రాజు నార్త్‌ మార్కెట్‌లో కూడా హిట్‌రాజుగా నిలవాలని స్కెచ్చులేస్తున్నాడు. హిందీ ప్రొడ్యూసర్లతో కలిసి కొన్ని సినిమాలు, స్ట్రయిట్‌గా పాన్‌ ఇండియన్‌ మూవీస్ నిర్మిస్తున్నాడు. శంకర్ డైరెక్షన్‌లో రామ్ చరణ్‌తో పాన్ ఇండియన్ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నాడు దిల్ రాజు. ఈ మూవీ లాంచింగ్‌కి రణ్‌వీర్ సింగ్‌ని తీసుకొచ్చి, ముహూర్తం షాట్‌కే హిందీ మార్కెట్‌ అటెన్షన్‌ని గ్రాబ్ చేశాడు.

దిల్‌ రాజు జడ్జ్‌మెంట్‌కి తెలుగులో మంచి వసూళ్లు దక్కాయి. కొన్ని సార్లు మిక్స్‌డ్ రిజల్ట్‌ వచ్చినా ఎక్కువ సార్లు హిట్ రాజు అనే మాటని నిలబెట్టుకున్నాడు. ఇలాంటి కథలనే ఇప్పుడు హిందీకి తీసుకెళ్తున్నాడు దిల్‌ రాజు. నాని నిర్మాణంలో వచ్చిన 'హిట్‌' సినిమాని హిందీలో రాజ్‌కుమార్ రావుతో రీమేక్ చేస్తున్నాడు.

దిల్ రాజు, అల్లు అరవింద్, అమన్ గిల్‌తో కలిసి హిందీ 'జెర్సీ' నిర్మిస్తున్నాడు. తెలుగులో గౌతమ్‌ తిన్ననూరి, నాని కాంబోలో వచ్చిన ఈ సినిమాని హిందీలో షాహిద్‌ కపూర్‌తో తీస్తున్నారు. ఈ మూవీతోనే బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు గౌతమ్‌ తిన్ననూరి. అలాగే బోనీ కపూర్‌తో కలిసి 'ఎఫ్2' సినిమాని రీమేక్ చేస్తున్నాడు. వీటితోపాటు గుణశేఖర్‌తో కలిసి 'శాకుంతలం' సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మరి ఈ మూవీస్‌తో దిల్ రాజు హిందీలో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

మొత్తానికి దిల్ రాజు నార్త్ మార్కెట్ ను టార్గెట్ చేశాడు. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు తీస్తూ చాలా బిజీ అయిపోయాడు. ఎక్కువ శాతం తెలుగు రీమేక్స్ తీస్తూ వైవిధ్యంగా ముందుకు వెళ్తున్నాడు.
అల్లు అరవింద్, అమన్ గిల్ తో కలిసి జెర్సీ రీమేక్ నిర్మాణం చేస్తూ.. ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు దిల్ రాజు. మరోవైపు దిల్ రాజు నిర్మాణంలోనే వస్తున్న శంకర్, రామ్ చరణ్ పాన్ ఇండియన్ మూవీ ప్రేక్షకుల్లో అంచనాలు రేకెత్తిస్తోంది.మరింత సమాచారం తెలుసుకోండి: