దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ముఖ్యంగా ఈ మహమ్మారి వలన తెలుగు చిత్ర పరిశ్రమ కుదేలు అవుతుంది. ప్రస్తుతం దేశంలో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తుండడంతో దర్శకనిర్మాతలకు తమ సినిమాలను వాయిదా వేయడం తప్ప మరో ఆప్షన్ కనిపించడం లేదు. ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలు నుంచి సాధారణ సినిమాలు చాలావరకు రిలీజ్ డేట్ ని మార్చుకున్నాయి. దాంతో ఇప్పటికే ఫ్యాన్స్, ఆడియన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా అదే లిస్టులోకి చేరింది యంగ్ టాలెంటెడ్ హీరో అడవి శేషు నటిస్తున్న 'మేజర్' సినిమా. 

శశికిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సోనీ పిక్చర్స్, జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎస్ మూవీస్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఇటీవలే ఇదే రిలీజ్ డేట్ ని అధికారికంగా కూడా ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ సినిమాను కూడా వాయిదా వేస్తున్నట్లు మేకర్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్ ఒక ప్రకటనలో పేర్కొంటూ..' ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా.. నియమాల దృష్ట్యా మేజర్ సినిమాను వాయిదా వేస్తున్నాం.

దేశం కోసం తెరకెక్కిన మేజర్ సినిమాని.. దేశంలోని పరిస్థితులు అన్నీ చక్కపడ్డాక మరో కొత్త రిలీజ్ డేట్ ప్రకటించి విడుదల చేస్తాం. అప్పటివరకు మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి' అంటూ చెప్పుకొచ్చారు. ఇక మేజర్ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్య ఈ సినిమా నుంచి ఓ పాటను కూడా విడుదల చేసారు. ఫేమస్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఈ సినిమాని నిర్మిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి అంచనాలను ఈ సినిమా ఏమిరా అందుకుంటుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: