కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తాజాగా నటించిన చిత్రం సన్నాఫ్ ఇండియా అయితే ఈ సినిమా నేడు విడుదల కానుంది. ఇక ఈ సినిమా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన విషయం తెలిసిందే.ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి సినిమాపై హైప్ క్రియేట్ చేయడంలో విఫలం అయింది. ప్రస్తుతం మోహన్ బాబు సినిమాలు అంటే ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అయితే మోహన్ బాబు సినిమాలనే కాదు.మంచు ఫ్యామిలీ నుండి వస్తున్న ఏ ఒక్క సినిమా కూడా ఈ మధ్య కాలంలో పట్టించుకోకపోవడంతో ప్రేక్షకులు లైట్ తీసుకుంటున్నారు.కాగా విష్ణు భారీగా ఖర్చు చేసి నిర్మించిన ఈ సినిమా మాత్రం కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది... అనే నమ్మకంతో ప్రతి ఒక్కరు ఉన్నారు.

 అయితే ప్రస్తుతం ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే జనాలు ఈ సినిమా పట్టించుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ సినిమాకి సంబంధించి పాజిటివ్ టాక్ వస్తే అయినా ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతారా అనేది చూడాలి.కాగా మొదటి రోజైన నేడు వసూలు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది.ఇటీవల అడ్వాన్స్ బుకింగ్ మరీ దారుణంగా జరిగిందని ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఇక ఈ సినిమా అతి తక్కువ థియేటర్లలో రిలీజ్ అవుతుంది ఇక ఈ సినిమాకి ఇతర సినిమాల నుండి పోటీ లేదు. పరిస్థితి ఇలా ఉన్నా కూడా పెద్దగా వసూళ్లను దక్కించుకునే అవకాశం కనిపించడం లేదని ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రకారం  ఈ మధ్య కాలంలో  మోహన్ బాబు  మరియు ఆయన తనయుడు  మంచు విష్ణు  చేస్తున్న వ్యాఖ్యలు కూడా

 ఈ సినిమాపై జనాల్లో ఆసక్తి కలగక పోవడానికి ఒక కారణం అయి ఉంటుందని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో మోహన్ బాబు కు జోడిగా మీనా కనిపించగా కీలక పాత్రలో  ప్రగ్యా జైస్వాల్  కనిపించనుంది. అయితే మోహన్ బాబు చేసిన వ్యాఖ్యల ప్రకారం ఈ సినిమా లోని ఒక సన్నివేశం కోసం గ్రాఫిక్స్ ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు ఆయన చెప్పు కు రావడం జరిగింది.ఇక ఆ పాట ఆ గ్రాఫిక్స్ మరీ నాసిరకంగా ఉన్నాయి.కాగా తాజాగా  ఇలాంటి గ్రాఫిక్స్ తో పరువు తీసుకోవడం తప్పితే మరేం లేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: