'పుష్ప' సినిమా థియేటర్ల నుంచి వెళ్లిపోయి చాలా రోజులు అయింది. ఈ గ్యాప్‌లో బోల్డన్ని సినిమాలు కూడా విడుదలయ్యాయి.  అయితే జనాలు మాత్రం పుష్పరాజ్ ఫీవర్‌ నుంచి ఇంకా బయటపడలేకపోతున్నారు. సెలబ్రిటీస్‌ కూడా ఇంకా పుష్ప మేనియాలోనే ఉండిపోయారు. క్రికెటర్స్‌ నుంచి మొదలుపెడితే పొలిటీషియన్స్‌ వరకు పుష్పని గుర్తుచేసుకుంటూనే ఉన్నారు.

అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా 2021కి లాస్ట్‌ పంచ్ ఇచ్చింది. భారీ వసూళ్లతో పోయినేడాదికి బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ బెల్ట్‌లోనూ ఈ మూవీకి క్రేజీ కలెక్షన్లు వచ్చాయి. ఒక్క నార్త్‌ ఏరియాలోనే ఈ సినిమా 100 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. హిందీ బెల్ట్‌లో బీ,సీ సెంటర్స్‌ని ఊపేసిన ఈ సినిమా డైలాగులు, స్టెప్పులకి నార్త్‌లో బోల్డంత క్రేజ్ వచ్చింది.

ఇండియా, శ్రీలంక టీ-20 సీరీస్‌లో కూడా 'పుష్ప' మేనియా కనిపించింది. ఫస్ట్ టీ-20లో రవీంద్ర జడేజా వికెట్ తీయగానే 'పుష్ప' తరహాలో తగ్గేదేలే అంటూ గడ్డం సరిచేసుకున్నాడు. అయితే జడేజా ఇంతకుముందు కూడా 'పుష్ప'ని రీక్రియేట్ చేశాడు. తగ్గేదేలా అంటూ డైలాగ్‌ చెప్పడంతో పాటు గడ్డం పెంచి పుష్ప లుక్‌ని రీక్రియేట్ చేశాడు.

డేవిడ్‌ వార్నర్‌ 'పుష్ప' లుక్‌ వచ్చినప్పటి నుంచి ఫేస్‌ యాప్‌తో హడావిడి చేస్తూనే ఉన్నాడు. అలాగే ఇండియన్ క్రికెటర్స్‌ కూడా పుష్పని దింపుతున్నారు. ఓపెనింగ్‌ బ్యాటర్ శిఖర్ ధావన్ తగ్డేదేలా అంటూ రీల్స్‌ చేశాడు. అలాగే బిగ్ హిట్టర్ సూర్య కుమార్ యాదవ్, వికెట్ కీపర్ ఇషాన్‌ ఇద్దరూ కలిసి శ్రీవల్లి పాటకి స్టెప్పులేశారు.

పొలిటీషియన్స్‌ కూడా 'పుష్ప' డైలాగులు వాడుతున్నారు. హిందీ బెల్ట్‌లో జూకేగా నై అని పుష్ప వంద కోట్లు కలెక్ట్‌ చేస్తే, ఆ జూకేగా నై డైలాగ్‌ని ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లోనూ వాడుతున్నారు. రక్షనశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఒక ఎన్నికల ప్రచార సభలో జూకేగా నై అని డైలాగ్‌ చెప్పాడు. అలాగే పొలిటీషియన్ల సోషల్ మీడియాలోనూ జూకేగా నై అనే డైలాగ్ కనిపిస్తూనే ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: